ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రారంభo, ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలల తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్

పత్రికా ప్రకటన,       తేది:06.05.2022, వనపర్తి.

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
శుక్రవారం ప్రభుత్వ బాలుర కళాశాల, ప్రభుత్వ బాలికల కళాశాలలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయగా, స్కాలర్స్ జూనియర్ కళాశాల, సి.వి.రామన్ జూనియర్ కళాశాలలను జిల్లా అదనపు కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, రవాణా, వైద్యం, తదితర సౌకర్యాలను ఆమె పరిశీలించారు.
జిల్లాలో 22 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్నాయని, ఈ నెల 6వ. తేది నుండి 19వ. తేది వరకు పరీక్షలు జరుగుతాయని ఆమె సూచించారు. వనపర్తి జిల్లాలో మొత్తం ఇంటర్మీడియట్ విద్యార్థులు (6308) మంది పరీక్షలు వ్రాయవలసి ఉండగా, (6008) మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారని, (300) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారనీ ఆమె వివరించారు. జిల్లాలో పరీక్షలకు హాజరైన మొత్తం విద్యార్థులు 95.24 శాతం నమోదైనట్లు ఆమె సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, పరీక్ష కేంద్రాలకు రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, మునిసిపాలిటీ తదితర శాఖల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు.
జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఇంటర్మీడియేట్ శాఖ అధికారి ప్రకాశం శెట్టి, ఎం.ఆర్.ఓ. రాజేందర్ గౌడ్, డి.డబ్ల్యూ.ఓ. పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.
…………

జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి  ద్వారా జారీ చేయడమైనది.

Share This Post