ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమిష్టి బాధ్యతో పనిచేయాలని అదనపు కలెక్టర్ రమేష్

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమిష్టి బాధ్యతో పనిచేయాలని అదనపు కలెక్టర్ రమేష్

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమిష్టి బాధ్యతో పనిచేయాలని అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. ఈ నెల 25 నుండి నవంబర్ 1 వరకు నిర్వహించు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరపు పరీక్షలకు 7,211 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరవుతున్నారని, అందుకోసం జిల్లాలోన 34 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కాగా ఇందులో 6,626 మంది జనరల్, 585 మంది ఒకేషనల్ కోర్సు చదువుచున్న విద్యార్థులు హాజరవుచున్నారని అన్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరపు పరీక్షల ఏర్పాట్లపై సోమవారం తన ఛాంబర్ లో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ రమేష్ మాట్లాడుతూ మొదటి సంవత్సరం ప్రమోట్ అయి ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుచున్న విద్యార్థులకు మొదటి సంవత్సరపు పరీక్షలు 70 శాతం సిలబస్ తో నిర్వహిస్తున్నామని అన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు జరిగి థియరీ పరీక్షలకు విద్యార్థులు తప్పని సరిగా మాస్కు ధరించి ఒక గంట ముందుగా రావాలని, ఎట్టి పరిస్థితులలో 9 గంటల తరువాత పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష హాలుకు సెల్ ఫోన్ అనుమతించబడదని, పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాలలో పరీక్షా సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచాలని అన్నారు.
ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పరీక్షా కేంద్రాలు పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ ఖచ్చితంగా అమలు చేయాలని, శాంతి భద్రతలను కాపాడాలని పొలిసులకు, విద్యుత్తు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్తు అధికారులకు, పరీక్షా కేంద్రాల ప్రాంతాలకు సమయానుకూలంగా రూట్ బస్సులు నడపాలని ఆర్.టి.సి. అధికారులకు, సకాలంలో పరీక్ష పేపర్లు కేంద్రాలకు తరలించేలా వాహనాలు సమకూర్చాలని ఆర్.టి.ఏ కు, ప్రథమ చికిత్సకై తగు ఏర్పాటు చేయవలసినదిగా వైద్యాధికారులకు, మంచి నీటి సౌకర్యం కల్పించవలసినదిగా మిషన్ భగీరథ అధికారులకు, ఏ రోజు కారోజు పరీక్ష పేపర్ బండిల్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా సంగారెడ్డి లోని డి.ఆర్.డి.సి. కేంద్రానికి పంపాలని పోస్టల్ అధికారులకు సూచించారు. అదేవిధంగా అవసరమైన ఇన్విజిలేటర్ల నియామకానికి ఉపాధ్యాయులను ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారి సూచించారు.
పరీక్షలు సజావుగా నిర్వహించుటకు 34 మంది చొప్పున చీఫ్ సూపెరింటెండెంట్లను, శాఖాధికారులను నియమించడంతో పాటు సిట్టింగ్ స్క్వాడ్ , ఫ్లైయింగ్ స్క్వాడ్ నియమిస్తున్నామని అన్నారు. కొన్ని కేంద్రాలు సున్నితం, అతి సున్నితంగా గుర్తించి శాంతి భద్రతల పరిరక్షణకు తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు.
పరీక్షలు ఇలా.. ఈ నెల 25 న సెకండ్ లాంగ్వేజ్ మొదటి పేపర్, 26న ఇంగ్లీష్ మొదటి పేపర్, 27న మాథ్స్ -1 ఏ , బోటనీ, పొలిటికల్ సైన్స్ మొదటి పేపర్, 28 న మాథ్స్ -1 బి, జూలోజి, హిస్టరీ , 29 న ఫిజిక్స్, ఎకనామిక్స్, 30 న కెమిస్ట్రీ, కామర్స్, నవంబర్ 1 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జ్ కోర్స్ మాథ్స్ , 2న మాడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహింపబడతాయని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సత్యనారాయణ, కమిటీ సభ్యులు సూర్య ప్రకాష్, లక్ష్మి, జిల్లా విద్యా శాఖాధికారి రమేష్, ఆర్.టి.ఓ. శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకటేశ్వర్ రావు , డిపిఆర్ ఓ. శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post