ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

తేదీ 1.8. 2022 నుండి 06.07.2022 వరకు
ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు

సాయంత్రం2.30 గంటల నుండి5.30 గంటల వరకు పబ్లిక్ సప్లమెంటరీ పరీక్షలు

అదనపు కలెక్టర్ జి. వి. శ్యామ్ ప్రసాద్ లాల్

000000

     జిల్లాలో 1ఆగస్టు నుండి 6 తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ సప్లమెంటరీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను సూచించారు.

     శుక్రవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ లో హాల్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ సప్లమెంటరీ పరీక్షలు- 2022 లపై నిర్వహించిన సన్నాహక/ సమన్వయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు1 నుండి ఆగష్టు6వ తేదీ వరకు ఉదయం9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు సాయంత్రం 2.30గంటల నుండి 5.30 గంటల వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు – ఆగస్టు 2022ను అధికారులు సమన్వయంతో, పకడ్బందీగా నిర్వహించాలని, సంభంధిత అధికారులకు పరీక్షల నిర్వహణ కు సంభంధించి సూచనలు చేశారు. జిల్లాలో మొత్తం 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు. పరీక్షల సందర్భంగా అన్ని సెంటర్ల దగ్గర 144 సెక్షన్ అమలు చేయాలని రెవెన్యూ శాఖను, అన్ని సెంటర్ల దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, క్వశ్చన్ పేపర్ లు తరలించేటప్పుడు పోలీస్ భద్రత కల్పించాలని పోలీసు శాఖకు సూచించారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు ఇన్విజిలేటర్ల కొరతగా ఉన్నప్పుడు అవసరమైన ఇన్విజిలేటర్ SGT/PET లను నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని సూచించారు. మారుమూల మండలాలు మరియు గ్రామాలలో ఉన్న పరీక్షా కేంద్రాల విద్యార్థుల సౌకర్యార్ధం బస్సుల ను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఉన్న అన్ని పరీక్షా కేంద్రాలకు నిరంతరాయంగా ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 మరియు మధ్యాహ్నం 02:30 నుండి సాయంత్రం 05:30 గంటల వరకు విద్యుత్ సరపరా చేయాలనీ విద్యుత్ శాఖ అధికారులను సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని పరీక్షా కేంద్రాలలో పరిక్షా సమయం లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. ఆన్సర్ బుక్ బండల్స్ ను రిసీవ్ చెసుకునేందుకు కరీంనగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్ లో అదనంగా కౌంటర్ లను ఏర్పాటు చేయాలని పోస్టల్ శాఖ ను సూచించారు. ఎక్కడ మాస్ కాపింగ్ (మాల్ ప్రాక్టీస్ ) జరగకుండా, సెల్ ఫోన్ లను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించకుండ పలు జాగ్రతలు తీసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని అదేశించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు

     ఈ సమావేశం లో టి. రాజ్య లక్ష్మి, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(DIEO), డి సి పి శ్రీనివాస్,జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా,పరీక్షల కమిటీ సభ్యులు జగన్ మోహన్ రెడ్డి, వెంకట రమణా చారి, జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, ఆర్టీసీ ,విద్యుచ్ఛక్తి ,పోస్టల్ శాఖల అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

Share This Post