ఇంటర్మీడియల్ పరీక్షా కేంద్రాల్లో సిసి టివిలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం నుండి ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కాగా కలెక్టర్ కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి మహిళా కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రంలో 433 మంది విద్యార్థులకు పరీక్షలకు హారజరు కావాల్సి ఉండగా 19 మంది గైర్హాజరయినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సిసి టివిలు ఏర్పాటు లేనట్లు గమనించిన కలెక్టర్ తక్షణం సిసిటివిలు ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు. కేంద్రంలో ఏమైనా ఇబ్బందులుంటే తక్షణం సంబంధిత తహసిల్దార్ దృష్టికి తెచ్చి పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జలుబు, జ్వరం, దగ్గు తదితర లక్షణాలున్న విద్యార్ధులను ప్రత్యేక కేంద్రంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్ధినికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పరీక్షకు ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. విద్యార్ధులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఏవేని లక్షణాలున్నట్లయితే అధ్యాపకులకు తెలియచేయాలని ఆయన సూచించారు. విద్యార్థులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, తహసిల్దార్ రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post