*ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు … జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ.*

*ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు … జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ.*

ప్రచురణార్థం

*ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు … జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ.*

*నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు*

*ఇంటర్ పరీక్షా కేంద్రాల లొకేషన్ కోసం మొబైల్ యాప్*

మహబూబాబాద్, మే -04:

ఈ నెల 6 నుండి నిర్వహించే ఇంటర్ పరీక్షలను విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్రాసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ నేడోక ప్రకటనలో తెలిపారు.

పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతుంది అని, ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్షా హాలులో అనుమతించరాదనే నిబంధన అమలులో ఉన్నదని, ఉదయం 8 గంటల నుండి పరీక్షా హాలులో అనుమతించనున్నందున విద్యార్థులు గంట ముందు పరీక్షా కేంద్రాలలోకి వెళ్లి నిబంధనల్ని, సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ఈసారి ప్రశ్నల సమాధానాలకు సంబంధించి యాభై శాతం ఛాయిస్ ఉంటుందని, విద్యార్థులు గతంలో కంటే ఉత్సాహంగా, ధైర్యంగా పరీక్షలు రాసే అవకాశం ఉందని తెలిపారు.

పరీక్షా కేంద్రాలకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేరేందుకు పరీక్షా సెంటర్ లోకేషన్ కోసం మొబైల్ యాప్ ను తీసుకొని రావడం జరిగిందని, గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.

జిల్లాలో (19) పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ -4428, వొకేషనల్ – 1605 కలిపి 6033 మంది, రెండవ సంవత్సరం జనరల్ -4202, వొకేషనల్ – 1409 కలిపి 5611 మంది, మొత్తం 11644 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, పరీక్షా కేంద్రాల్లో త్రాగునీరు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం తో పాటు, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అన్ని జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించామని తెలిపారు.

ఆర్టిసి ద్వారా పరీక్షా సమయం ననుసరించి రవాణా కల్పించి పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా, పరీక్ష అయిన తర్వాత ఇళ్లకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పరీక్షా హాలులో విద్యార్థులతో పాటు, అధికారులు సెల్ ఫోన్ లను పరీక్షా కేంద్రాల లోనికి తీసుకొని రావద్దని, తమ ఫోన్ లను ఏర్పాటు చేసిన కౌంటర్ లో అందజేయాలని తెలిపారు. పరీక్షా హాలులో క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపడం జరుగుతుందని, ఎలాంటి మాస్ కాపీయింగ్ జరుగకుండా ప్రతి విద్యార్థిపై పర్యవేక్షణ కోసం చీఫ్ సూపరింటెండెంట్ లు, ప్రభుత్వ అధికారులను నియమించామని, పరీక్షల కోసం 465 మంది ఇన్విజిలేటర్ లను, మాస్ కాపీయింగ్ నిరోధించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ లను, సిట్టింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

హాల్ టికెట్ పొందని ఇంటర్ విద్యార్థులు http://tsbie.cgg.gov.in వెబ్సైట్ నుండి ముందుగా డౌన్లోడ్ చేసుకోవాలని, హాల్ టికెట్ లో ఏమైనా తప్పులు ఉంటే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకొని వెళ్లి డి. ఐ. ఈ. ఓ. ద్వారా వాటిని సరి చేసుకోవాలని తెలిపారు.

పరీక్షల సమయంలో ఏమైనా మానసిక ఆందోళనలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 18005999333 కు ఫోన్ చేయాలని, విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు ఎవరైనా ఫోన్ చేయవచ్చని తెలిపారు.

పరీక్షా కేంద్రం వద్ద వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఏ.ఎన్.ఎం. అందుబాటులో ఉంటారని, ఓ.అర్.ఎస్. తో పాటు అత్యవసర ఇతర మందులు సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎండ ప్రభావం పడకుండా అవసరమైన చర్యలు తీసుకున్నా మని తెలిపారు.

విద్యార్థిని, విద్యార్థులు ఎటువంటి భయాందోళనలు లేకుండా ధైర్యంగా, ఉత్సాహంగా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు వ్రాయాలని సత్యనారాయణ ఆ ప్రకటనలో తెలిపారు.

——————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post