ఇంటర్ పరీక్షలను పకడ్భందిగా నిర్వహించాలి :: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ప్రచురణార్థం-3 తేదీ.21.10.2021
ఇంటర్ పరీక్షలను పకడ్భందిగా నిర్వహించాలి :: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఇంటర్ పరీక్షలను పకడ్భందిగా నిర్వహించాలి :: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జగిత్యాల, అక్టోబర్ 21:- ఇంటర్ పరీక్షలు పకడ్భందిగా నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ పై గురువారం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలను ప్రభుత్వ నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం నిర్వహించుటకు కట్టుదిటమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ నెల 25 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్దంగా ఉండాలని, పరీక్షలు నిర్వహించే కేంద్రాలను శుభ్రం చేయించాలని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలి అని అన్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ జీవితంలో ఒక మలుపుకు నాంది అని, అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కరోనా తరువాత మొదటిసారిగా పరీక్షలు నిర్వహిస్తున్నందున కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేయవలసినదిగా కలెక్టర్లకు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, సి.సి. కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫర్నీచర్ ఉండేలా చూసుకోవాలి అని అన్నారు. ప్రతి రోజు శానిటైజ్ చేయాలని, మాస్కులు, శానిటైజర్లు, ధర్మల్ స్క్రీనింగ్, ప్రథమ చికిత్సకు వైద్యులు, అంబులెన్స్ లు అందుబాటులో ఉంచాలని, జ్వరం లక్షణాలున్న వారికి ప్రత్యేక గది కేటాయించాలని వైద్య అధికారులకు మంత్రి సూచించారు.విద్యార్థులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల చుట్టూ ఉండే జిరాక్స్ సెంటర్లు పరీక్ష జరిగే సమయంలో మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని రావద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, విద్యుత్ అధికారులకు ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, పరీక్షలకు 9 వేల 259 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరవుతారని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులతో సన్నాహక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తగు ఆదేశాలిచ్చామని తెలిపారు. జిల్లాలో 7 సెంటర్ లో సిసి కేమేరాలు లేకుంటే ఏర్పాటు చేసామని, ప్రతి పరీక్షా కేంద్రంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థుల సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునే విధంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని కలెక్టర్ తెలిపారు.
ఆర్.డి.ఓ. జగిత్యాల, జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి , డి.ఈ.ఓ. సంబంధిత అధికారులు, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయనైనది

Share This Post