ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి… అదనపు కలెక్టర్ రాజర్షి షా

ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలి… అదనపు కలెక్టర్ రాజర్షి షా

జిల్లాలో ఈనెల 25 నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు.

జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరపు పరీక్షల నిర్వహణపై ఆయన తన చాంబర్ లో సంబంధిత అధికారులతో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడానికి ఆయా శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు.

పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లను, సిట్టింగ్,ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.

పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల లో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. స్టోరేజ్ పాయింట్స్ కు ప్రశ్నాపత్రాలు చేర్చడానికి క్లోజ్డ్ వాహనాలను ఏర్పాటు చేయాలని ఆర్ టి ఏ అధికారులకు సూచించారు.
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకు ఆదేశించారు.

ప్రతి పరీక్షా కేంద్రం లో ఒక
ఏ ఎన్ ఎం ను ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మాస్కులు, శానిటైజర్, ఫీవర్ స్కానర్ తో సిద్ధంగా ఉంచాలనీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షా సమయానికి కేంద్రాలకు చేరుకునే విధంగా ఆయా రూట్లలో అదనపు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆయా అధికారులందరు సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన కోరారు.

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా ఇంటర్మీడియెట్ అధికారి గోవింద రామ్ తెలిపారు. పరీక్షలు అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటల నుంచి 12:00 గంటల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 16,255 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు.

ఈ సమావేశంలో పోలీస్, విద్యాశాఖ , డిఎంఅండ్హెచ్ఓ, ఆర్టిఏ, టి ఎస్ ఆర్ టి సి, ట్రాన్స్కో, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share This Post