ఇంటర్ పరీక్షలో ఒకరిపై మాల్ప్రాక్టీస్ కేసు…. 649 మంది గైర్హాజరు

జిల్లాలో శుక్రవారం ఇంటర్ పరీక్షల్లో ఒకరి పై మాల్ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 649 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీ రఘురాజ్ తెలియజేశారు. ఏడవ రోజు శుక్రవారం మొదటి సంవత్సరం గణిత శాస్త్రం-1బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయి. ఈ రోజు మొత్తం 14,984 మంది విద్యార్థులకు గాను 649 మంది విద్యార్థులు గైర్ హాజరు కాగా 14,335 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 95.7 శాతం విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి తెలియజేశారు . ఇంటర్ విద్యా ఆధికారి జిల్లా కేంద్రంలోని కాకతీయ మహిళా జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం, శ్రీ కాకతీయ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం, ఎస్.ఎస్.ఆర్. పరీక్ష కేంద్రము, నిర్మల హృదయ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం, కంటేశ్వర్ లోని ఎస్.ఆర్ . జూనియర్ కళాశాల ను తనిఖీ చేసి సమీక్షించారు. పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిరంజీవి డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మారం రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల, డిచ్పల్లి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల, ధరపల్లి మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల, ధరపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ కమిటీ మరో సభ్యుడు చిన్నయ్య నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఉమెన్స్ జూనియర్ కళాశాల, ఎస్.ఆర్. జూనియర్ కళాశాల, ఆర్మూర్ రోడ్ లోని ఎస్.ఆర్.జూనియర్ కళాశాల తనిఖీ చేశారు. అలాగే హైపవర్ కమిటీ రవికుమార్ 5 పరీక్ష కేంద్రాలను బాల్కు అధికారి రజియుదిను మరో ఐదు కేంద్రాలను తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం ఈరోజు బాల్కొండ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాల లో కాపీ చేస్తున్న ఒక విద్యార్థి పై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు.

————————————————-

Share This Post