ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

ప్రచురణార్థం

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మరిపెడ
మహబూబాబాద్ జిల్లా, మే -11:

ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. శశాంక తనిఖీ చేశారు.

బుధవారం మరిపెడ కేంద్రంలో గల టి.ఎస్.డబ్ల్యూ.ఆర్.ఎస్. జూనియర్ బాలుర కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. శశాంక తనిఖీ చేశారు.

జిల్లా కలెక్టర్ పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 5వ రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం మాథెమాటిక్స్ పేపర్ -1ఏ., బాటనీ పేపర్ -1 ఏ., పొలిటికల్ సైన్స్ పేపర్ -1 ఏ పరీక్ష జరుగుతుందని, పరీక్షా కేంద్రంలో 386 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 359 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరు అయ్యారని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.

తనిఖీలో కలెక్టర్ వెంట చీఫ్ సూపరింటెండెంట్ వి. శ్రీనివాస రావు, తహసిల్దార్ రాంప్రసాద్, మునిసిపల్ కమిషనర్, తదితరులు పాల్గొన్నారు.

——————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post