ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 5505 మంది విద్యార్థులు హాజరు:: ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ

ప్రచురణార్థం

ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 5505 మంది విద్యార్థులు హాజరు:: ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ*

మహబూబాబాద్, మే -11:

జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, బుధవారం 5వ రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం మాథెమాటిక్స్ పేపర్ -1ఏ., బాటనీ పేపర్ -1 ఏ., పొలిటికల్ సైన్స్ పేపర్ -1 ఏ పరీక్షకు 5505 మంది హాజరు కాగా, 655 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖాధికారి సమ్మెట సత్యనారాయణ నేడోక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో 19 ఇంటర్ పరీక్షా కేంద్రాలలో జనరల్, వొకేషనల్ కలిపి 6160 మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాయాల్సి ఉండగా, 5505 మంది విద్యార్థులు హాజరయ్యారని, జిల్లాలో మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని , ప్రశాంతంగా పరీక్ష జరిగిందని, 655 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.

జనరల్ అభ్యర్థులు 4544 మందికి గాను 4243 మంది హాజరు కాగా, 301 మంది గైర్హాజరు అయ్యారని, అలాగే వొకేషనల్ 1616 మందికి గాను 1262 మంది హాజరు కాగా 354 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యా రని తెలిపారు. మొత్తంగా ఈ రోజు 89.4 శాతం హాజరయ్యారని తెలిపారు.

———————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post