ఇంటర్ మెదటి సంవత్సరం వార్షిక పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య

జనగామ, అక్టోబర్ 25: జిల్లా వ్యాప్తంగా కరోనా నియమ నిబంధనలతో ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలను కలెక్టర్ స్థానిక సాంఘిక సంక్షేమ పాఠశాలలో పరిశీలించారు జిల్లాలో ని 21 పరీక్షా కేంద్రాల లో 4 వేల 962 మంది విద్యార్థులకు గాను 4 వేల 366 మంది హాజరైనారని ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించి పరీక్షా కేంద్రాల వద్ద సిసి కెమెరాలు, ఉదయం,సాయంత్రం శానిటేషన్ నిర్వహించి వైద్య సిబ్బంది అందుబాటులొ ఉన్నారని, కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
——————————————————————————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జనగామచే జారీ చేయడమైనది.

Share This Post