ఇంటింటా ఇన్నోవేటర్స్ కు దరఖాస్తు ఆహ్వానం… జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

ఇంటింటా ఇన్నోవేటర్స్ కు దరఖాస్తు ఆహ్వానం…

మహబూబాబాద్ జూలై 17:

ఈ నెల 25వ తేదీ లోపు ఇంటింటా ఇన్నోవేటర్స్ కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్ కోరారు.

ఈ మేరకు కలెక్టర్ నేడొక ప్రకటనలో పేర్కొంటూ ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నో వేటర్ సెల్ అవకాశం కల్పించిందన్నారు.

విద్యార్థులే కాక గ్రామీణ పట్టణ ప్రజలు కూడా ఇన్నోవేటర్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులన్నారు.

ఈనెల 25వ తేదీలోగా వాట్సాప్ నెంబర్ 9100678543 కు పంపించాలన్నారు. సేకరించిన
ఇంటింటా ఇన్నోవేటర్స్ ను రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ కు పంపిస్తామని, జిల్లా నుండి ఎంపికైన 5 ఆవిష్కరణలను ఆగస్టు 15న ఆన్లైన్లో ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. రెండు నిమిషాల వ్యవధిలో రూపొందించిన వీడియో ఆవిష్కరణ కు సంబంధించి నాలుగు ఫోటోలు, ఐదు పంక్తులలో ఆవిష్కరణ వివరాలు, ఆవిష్కర్త పేరు, వయసు, వృత్తి, మొబైల్ నెంబర్, గ్రామం, మండలం, జిల్లా పేరు వివరాలతో పంపించాలని సూచించారు. ఇతర వివరాలకు జిల్లా సైన్స్ ఆఫీసర్ 9849598281 ను సంప్రదించాలని ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
—————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post