ఇంటింటా ఇన్నోవేటర్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు – ఆవిష్కరణలను పంపడానికి చివరి తేదీ ఆగస్ట్ 10

ప్రచురణార్థం

ఇంటింటా ఇన్నోవేటర్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు – ఆవిష్కరణలను పంపడానికి చివరి తేదీ ఆగస్ట్ 10

మహబూబాబాద్, జూలై-27:
స్వాతంత్య్ర దినోత్సవం ను పురస్కరించుకొని సామాజిక సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు రూపొందించిన జిల్లా ఆవిష్కర్తలు వారి ఆవిష్కరణ లను అంతర్జాలంలో ప్రదర్శించడానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC)అవకాశం కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
ఇంటింటా ఇన్నోవేటర్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆగస్ట్ 10 కి పొడిగించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అవిష్కర్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాల వేదికగా జిల్లాలో ఉన్న విద్యార్థులు మరియు గ్రామీణ, పట్టణ ఆవిష్కరణలకు ,స్టార్టప్ సూక్ష్మ ,చిన్న తరహా పరిశ్రమలు , యువ శాస్త్రవేత్తలకు నుంచి ఆహ్వానిస్తున్నాం అన్నారు.

ఆవిష్కరణ అనగా,

సమస్యలు, అవి మన సమాజంలో అయినా లేదా మన చుట్టు ప్రక్కల ఉన్నవైన, ఇంట్లో సమస్యలైన, లేదా విద్యాలయాలలో అయివుండవచ్చు, లేదా వ్యవసాయానికి సంబంధించినది అయిన, ఏ రంగానికి సంబంధించినదైనా కావచ్చు. వాటిని పరిష్కరించే విన్నూత ఆలోచనే/పరికరమే ఒక ఆవిష్కరణ

ఆవిష్కరణను నాలుగు భాగాలుగా విభజిస్తారు.

1) ఒక సమష్యకు కొత్త పరిష్కారం కన్నుకున్నా.

2) ఒక సమష్యకు పరిష్కారం కనుక్కునే విధానం కొత్తగా ఉన్నా, ఆవిష్కరణ అంటాము.

3) ఒక పరికరము చేస్తూ దానిలో ఉపయోగించే వస్తువులు/పరికిరాలు వినూత్నంగా ఉన్నా, ఆవిష్కరణ అంటాము.

4) ఉన్న వస్తువుకే మరింత ఆలోచన జతచేసి దాని ఉపయోగాలు పెరిగినా, ఆవిష్కరణ అంటాము అని పేర్కొన్నారు.

ఎంపికైన వాటిని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఆన్లైన్లో ప్రదర్శిస్తామని తెలిపారు. ఆన్లైన్ వేదికగా స్థానిక సమస్యలను పరిష్కరించే క్రమంలో సృజనాత్మకతను జోడించి తయారుచేసిన ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకొనుటకు ఆగస్టు 10 తేదీలోపు 9100678543 మొబైల్ నంబర్ కు వాట్సప్ ద్వారా తమ ఆవిష్కరణలకు సంబంధించిన 2 రెండు నిమిషాల వీడియో, ప్రాజెక్ట్ నాలుగు ఫోటోలు , ఆరు లైన్లలో ఆవిష్కరణ గురించి, వివరాలు ,పేరు ,ఫోన్ నెంబర్, వృత్తి , వయసు ,గ్రామము, జిల్లా వివరాలను తెలియజేయాలన్నారు. జిల్లాలోని ఔత్సాహిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

ఎంపికైన వాటిని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో ఆన్లైన్లో ప్రదర్శిస్తామని తెలిపారు. ఆన్లైన్ వేదికగా స్థానిక సమస్యలను పరిష్కరించే క్రమంలో సృజనాత్మకతను జోడించి తయారుచేసిన ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకొనుటకు ఆగస్టు 10 తేదీలోపు 9100678543 మొబైల్ నంబర్ కు వాట్సప్ ద్వారా తమ ఆవిష్కరణలకు సంబంధించిన 2 రెండు నిమిషాల వీడియో, ప్రాజెక్ట్ నాలుగు ఫోటోలు , ఆరు లైన్లలో ఆవిష్కరణ గురించి, వివరాలు ,పేరు ,ఫోన్ నెంబర్, వృత్తి , వయసు ,గ్రామము, జిల్లా వివరాలను తెలియజేయాలన్నారు. ఆవిష్కరణ లు పంప గొరే వారు మరింత సమాచారం, సందేహాల నివృత్తికి సిద్దిపేట జిల్లా సైన్స్ అధికారి బి. అప్పారావు,చరవాణి నెంబర్ 9849598281 ను సంప్రదించాలన్నారు. జిల్లాలోని ఔత్సాహిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

=======================================================================
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది

Share This Post