“ఇంటింటా ఇన్నోవేటర్‌” ఆవిష్కరణల దరఖాస్తు గడుపు పెంపు

ఇంటింటా ఇన్నోవేటర్‌” ఆవిష్కరణల ఆన్‌లైన్‌ ప్రదర్శన కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువు తేదీని ఆగష్టు 10 వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్‌ అమయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ ఆధ్వర్యంలో సామాజిక సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు రూపొందించిన ఆవిష్కర్తలు వారి ఆవిష్కరణలను కోవిడ్‌-19 నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ప్రదర్శించడానికి అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా కొత్త ఆవిష్కరణల ప్రదర్శనకు ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు, గ్రామీణ, పట్టణ ఆవిష్కర్తలు, స్టార్టప్‌, సూక్ష్మ మధ్య తరహా రంగాలలో నూతన ఆవిష్కరణలను ప్రదర్శించవలసి ఉంటుంది. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన రెండు నిమిషాల వీడియో, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫోటోలు, ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలకు మించని సమాచారం, ఆవిష్కర్త పేరు, ఫోన్‌ నెంబర్‌, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం, మండలం, మరియు జిల్లా పేరును 9100678543 నెంబర్‌కు వాట్సప్‌ చేయాలని అన్నారు. ఆగస్టు 10వ తేది నాటికి అందిన ఆవిష్కరణలను రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ పరిశీలించి జిల్లా నుండి 5 ఆవిష్కరణలను ఎంపిక చేసి స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆన్‌లైన్‌ ద్వారా ప్రదర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి, సి. రాజిరెడ్డి సెల్‌:9849929798 నెంబర్‌ సంప్రదించాలని పేర్కొన్నారు.

Share This Post