ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణల దరఖాస్తులకు చివరి తేది ఆగస్ట్ 10 వరకు పొడిగింపు జిల్లాలోని ఆవిష్కర్తలందరూ భాగస్వాములవ్వాలి:: జిల్లా కలెక్టర్ కె. నిఖిల

జనగామ, జూలై 27:

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని సమాజంలోని సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు చేసే అవిష్కర్తలు, వారు రూపొందించిన ఆవిష్కరణలు అంతర్జాలంలో ప్రదర్శించడానికి తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వారి కార్యక్రమం ఇంటింటా ఇన్నోవేటర్ కొరకు  గడువును ఆగస్ట్ 10 వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇంటింటా ఇన్నోవేటర్ కు సంబంధించి పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని అవిష్కర్తలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని ఆవిష్కర్తలు వారి ఆవిష్కరణలు వాట్సాప్ నెంబర్ 9100678543 ద్వారా నమోదు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మన సమాజంలో లేదా మన చుట్టూ ప్రక్కల, ఇంట్లో సమస్యలు, విద్య, వ్యవసాయం సంబంధించి గ్రామీణ, పట్టణ ఆవిష్కరణలకు, స్టార్టప్, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, యువ శాస్త్రవేత్తలు ఇది మంచి అవకాశమని ఆమె అన్నారు. ఏ రంగానికి సంబంధించిన ఆవిష్కరణ , సమస్యకు పరిష్కారం, వినూత్న ఆలోచన కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఆవిష్కర్తలు తమ తమ ఆవిష్కరణ రెండు నిమిషాల వీడియో, దానికి సంబంధించి 5 వ్యాఖ్యలు, నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయస్సు, వృత్తి, గ్రామం, జిల్లా పేరు వివరాలతో 9100678543 వాట్సాప్ నెంబర్ ద్వారా వెంటనే పంపాలని ఆమె అన్నారు. ఆవిష్కరణలు పంపగోరే వారు మరింత సమాచారం, సందేహాల నివృత్తి కొరకు జనగామ జిల్లా సైన్స్ అధికారిణి గౌసియా ఫోన్ నెం. 9963563959 ను సంప్రదించాలని కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమంలో జనగామ ఆర్డీవో మధు మోహన్, జిల్లా విద్యాధికారి కె. రాము, జిల్లా పంచాయతీ అధికారి కె. రంగాచారి, జిల్లా సైన్స్ అధికారిణి గౌసియా తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post