ఇంటింటా ఇన్నోవేటర్ గోడపత్రిక ఆవిష్కరణ : జిల్లా కలెక్టర్ షేక్ యాష్మీన్ బాష

పత్రికా ప్రకటన     తేది:25.07.2022, వనపర్తి.

– సృజనాత్మకతను ప్రోత్సహించడానికి ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణల ప్రదర్శనకు చక్కని వేదిక.
– ఇంటింటా ఇన్నోవేటర్ గోడపత్రిక ఆవిష్కరణ
—–
జిల్లాలోని ఔత్సాహికులు తమ ప్రతిభను చాటుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తున్నదని జిల్లా కలెక్టర్  షేక్ యాష్మీన్ బాషా అన్నారు.
ఈ సందర్భంగా సోమవారం కరణ నూతన జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో “తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్” వారు రూపొందించిన ‘ఇంటింటా ఇన్నోవేటర్’ గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ TSIC వారు రాష్ట్రంలో ఇన్నోవేషన్, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి, అన్ని జిల్లా కేంద్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నారని, ఈ ప్రదర్శన జిల్లా స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉంటుందన్నారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫోటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నెంబర్, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలను 9100678543 నెంబర్ కు వాట్సాప్ ద్వారా పంపాలని, అందుకున్న దరఖాస్తుల నుండి మొదటి షార్ట్ లిస్ట్ తరువాత, ప్రతి జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపిక చేయబడుతాయని, ఇన్నోవేటర్స్ నుండి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ 05 ఆగష్టు, 2022 అని ఆమె తెలియజేశారు.        మరిన్ని వివరాలకు జిల్లా సమన్వయకర్త యం.శ్రీనివాసులు, జిల్లా సైన్స్ అధికారి 9394574814  ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని జిల్లా పాలనాధికారి తెలిపారు.      ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా అదనపు పాలనాధికారి ఆశిష్ సంగ్వాన్, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవీందర్, జిల్లా సైన్స్ అధికారి యం.శ్రీనివాసులు, ఎల్.డి.ఎం. అమూల్ పవార్, డి ఎం హెచ్ ఓ రవిశంకర్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……. జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post