ఇంటింటా ఇన్నోవేషన్ గడువు పెంపు :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఇంటింటా ఇన్నోవేషన్ గడువు పెంపు :: జిల్లా కలెక్టర్ జి. రవి

                                                                ఇంటింటా ఇన్నోవేషన్ గడువు పెంపు :: జిల్లా కలెక్టర్ జి. రవి

          జగిత్యాల, అగస్టు 03: రాష్ట్ర ప్రభుత్వం గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నోవేషన్ ఆవిష్కరణల నమోదు గడువును అగస్ట్-10వ తేది వరకు పొడగించినట్లు జిల్లా కలెక్టర్ జి. రవి పేర్కోన్నారు.   మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో అన్నిశాఖల అధికారులతో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, శాఖాపరమైన చర్యలపై కన్వర్జెన్సి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్ను శ్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా రాష్ట్రంలోని 33 జిల్లాలోని విద్యార్థులు మాత్రమే కాకుండా ప్రజలు సామాజిక సమస్యలకు విన్నూత్నమైన పరిష్కారాలను చూపించే సృజనాత్మకతను వెలికితీసి వారి ఆలోచనలను ఆవిష్కరించేలా చేపట్టిన ఇంటింటా ఇన్నోవేషన్ కార్యక్రమ గడువు తేదీని ఈనెల 10వ తేది వరకు పొడగించినట్లు తెలిపారు.  ఇప్పటి వరకు జిల్లాలో ఆశావాహుల నుండి 10 ఆవిష్కరణలు దరఖాస్తులు చేసుకోగా 4 ఆవిష్కరణలు ఫైనల్ స్టేజీకి సెలక్ట్ అయినట్లు జిల్లా కలెక్టర్ పేర్కోన్నారు.  జలశక్తి అభియాన్ కార్యక్రమంలో బాగంగా మ్యాజిక్ సోక్ పిట్ల నిర్మాణాలను పూర్తిచేయాలని, ఇదివరకే ప్రారంభించిన పనులను త్వరగా పూర్తిచేయాలని, పూర్తిచేయని వాటిని వెంటనే ప్రారంభించి, నూరుశాతం నిర్మాణాలు పూర్తియ్యేలా చూడాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి నిర్వహణ చర్యలు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని పేర్కోన్నారు.  నర్సరీలలో రాబోయో అవసరాలకు సరిపోయోల మొక్కలను అందుబాటులో ఉంచుకోవాలని, వాటిని సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఎన్ని నర్సరీలు ప్రభుత్వ భూములలో ఉన్నాయో, ఎన్ని ప్రైవేటు భూములలో ఉన్నాయో నివేదికను సిద్దం చేయాలని,  ప్రైవేటు భూములలో ఏర్పాటు చేసిన నర్సరీలను ప్రభుత్వ స్థలాల్లో నర్సరీలకు తరలించేలా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కోన్నారు.  పట్టణ ప్రాంత ప్రజలు అవసరాల కొరకు ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా అధికారులు ప్రత్యక్ష తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.  గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ద్యం నిర్వహణ సక్రమంగా జరగాలని, రోడ్లపై గుంతలు ఏర్పడి నీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసెలా చూడాలని,  ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కెనాల్, చెరువులను తనిఖీలు చేస్తూ, ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.   ప్రభుత్వ ఆస్థుల వివరాలను ధరణి ఫోర్టల్ లో నమోదు చేయాలని, సిసి చార్జెస్, ట్రాక్టర్ల బ్యాంక్ బకాయిలను ఎప్పటికప్పుడు చేల్లించాలని, మహిళా సంఘాల ద్వారా తయారు చేయబడుచున్న వివిధ ఉత్పాధనలకు సహజ బ్రాండ్ ద్వారా విస్తృతంగా మార్కెటింగ్ జరిగేలా డిఆర్డిఓ దృష్టిసారించి ఆదిశగా చర్యలు చేపట్టాలని పేర్కోన్నారు.  ఈ ఆఫీస్ ద్వారా వచ్చే వివిధ ఫైళ్ల పరిష్కారంలో జాప్యం జరుగకుండా, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.  జిల్లాలో చేపడుతున్న రెండుపడకల ఇళ్ల నిర్మాణాలలో నాణ్యత లోపాలు లేకుండా పర్యవేక్షించాలని,  కొత్తగా జారిచేసిన ఆహార భద్రత కార్డు లబ్దిదారులకు ఈనెల నుండి సరుకులు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, బియ్యం అక్రమరవాణ జరుగకుండా నివారించగలగాలని, ఎప్పటికప్పుడు పటిష్టమైన నిఘా ద్వారా దుకాణాలు,  ద్వీచక్ర వాహనాలపై వచ్చి బియ్యం కోనుగోలు చేసే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.   జిల్లాలో ఎక్కడకూడా బియ్యం అక్రమ రవాణ జరుగకుండా కట్టుదిట్జమైన చర్యలను చేపట్టాలని.  బియ్యం అమ్ముకునే వారి కార్డులను సైతం రద్దు చేయాలని పేర్కోన్నారు.  వివిధ నష్టపరిహరాలను లబ్దిదారులకు సకాలంలో అందజేయాలని, పరిహారం చేల్లింపులో ఆలస్యం జరిగినట్లయితే అందుకు గల కారణాలను గురించి తెలియజేయాలని పేర్కోన్నారు.   అకాల వర్షాలతో తెగిపోయిన రోడ్లు,  నీటిమట్టం పెరిగి ప్రవాహం ఎక్కువైన కాలువల వలన ఎర్పడిన నష్టం వివరాలను తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.  మంకిఫుడ్ కోర్టులలో ఏర్పాటు చేసిన పండ్ల మొక్కలను పర్యవేక్షించడంతో పాటు, వాటి స్థితిగతులను డిఆర్డిఓ పర్యవేక్షించాలని అదేశించారు.  గ్రామాలు, పట్టణాలలోని గోడలపై అనవసరంగా వ్రాసినవాటిని రాతలపై వైట్ వాష్ వేసి అందంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.  వెలగని వీధిదీపాల పునరుద్దరణ పనులను వెంటనే చేపట్టాలని, విద్యూత్ బకాయిల వివరాలను అందజేయాలని, విద్యుత్ బకాయిలను సంబంధిత శాఖ అధికారులు వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.   కార్యక్రమం ఆనంతరం ఇంటింటా ఇన్నోవేటర్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి అరుణశ్రీ,  జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు శ్రీమతి మాదురి, వినోద్,  పిడి డిఆర్డిఓ  వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

ఇంటింటా ఇన్నోవేషన్ గడువు పెంపు :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఇంటింటా ఇన్నోవేషన్ గడువు పెంపు :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post