ఇంటింటా జ్వరం సర్వే పక్కడ్బందీగా నిర్వహించాలి… జిల్లా కలెక్టర్ నిఖిల..

కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చేపట్టిన జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య సిబ్బందిని ఆదేశించారు.

సోమవారం పరిగి మున్సిపల్ పరిధిలో మరియు చిట్యాల గ్రామంలో ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజలతో మాట్లాడారు. కోవిడ్ మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషను తీసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
జ్వరంతో బాధ పడుతున్న వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్ ఔషధ కిట్లు వెంటనే అందజేయాలని సర్వే బృందాలను ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తె మందులు వాడాలని సూచించారు. ఇంటింటి ఫీవర్ సర్వే లో జ్వరంతో బాధపడుతున్న వారిని, కోవిడ్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య కార్యకర్తలను కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని అన్నారు. ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్ సభ్యులు, ఆర్ పి లు సమన్వయంగా, బాధ్యతాయుతంగా సర్వేను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకోని వారికి వ్యాక్సిన్ అందజేయాలని, రెండవ డోజ్ తీసుకున్న వారికి బూస్టర్ డోజ్ (ప్రీ కాషనరీ) వాక్సినేషన్ చేయాలని వైద్య అధికారులను సూచించారు. 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ భయపడకుండా, మూఢ నమ్మకాలను నమ్మకుండా తప్పనిసరిగా వాక్సినేషన్ చేయించుకోవాలని కలెక్టర్ ప్రజలకు ఈ సందర్బంగా సూచించారు. మున్సిపల్ పరిధిలో ఈరోజు వాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేయాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారం, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మున్సిపల్ కమీషనర్ ప్రవీణ్ కుమార్, తహసీల్దార్ విద్యా సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post