ఇంటింటి ఫీవర్ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలి-స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

ఇంటింటి ఫీవర్ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ మల్టి డిసిప్లినరీ బృందాలకు సూచించారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా శనివారం మెదక్ మునిసిపాలిటీల్లో ఇంటింటా ఆరోగ్యం కార్యక్రమం పేర చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే బృందాలలోని సభ్యులైన అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, మెప్మా రిసోర్స్ పర్సన్లు, వైద్యుల నుద్దేశించి మాట్లాడుతూ బృందాలు పట్టణంలోని అన్ని వార్డులలో రోజు కనీసం వంద ఇళ్లను సందర్శించి దగ్గు,జలుబు, జ్వరం తో బాధపడుతూ కోవిడ్ లక్షణాలున్న వారికి ఐసోలేషన్న్ కిట్లు అందించి క్రమం తప్పకుండ 5 రోజులు మందులు వాడేలా అవగాహన కలిగించాలని అన్నారు. అదేవిధంగా మొదటి డోసు టీకా తీసుకొని రెండవ డోసు తీసుకొని వారిని, రెండో డోసు తీసుకొని ఇంకా బూస్టర్ డోసు తీసుకోని వారిని, అలాగే 15 నుండి 17 సంవత్సరాలలోపు యువతను గుర్తించి వారందరు తప్పక టీకాలు వేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఇంటింటి సందర్శన వివరాల నివేదికను ప్రతి రోజు సాయంకాలంలోగా పంపాలని సూచంచారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శ్రీహరి, డాక్టర్ మణికంఠ, హెల్త్ సూపెర్వైజర్ పవన్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.
————————————————————————–

Share This Post