ఇంటింటి సర్వేలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామస్థాయి, మున్సిపల్ సిబ్బంది బృంధంలా ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటిని సందర్శించి ఇంటింటా ఆరోగ్య వివరాలను తెలుసుకొని పాజిటివ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి స్వల్ప లక్షణాలు కలిగిన వారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్, తీవ్ర లక్షణాలు కలిగిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకునేలా గ్రామ, మండల స్తాయి. మున్సిపల్ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు.

ప్రచురణార్ధం.

జనవరి, 20 ఖమ్మం –

ఇంటింటి సర్వేలో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామస్థాయి, మున్సిపల్ సిబ్బంది బృంధంలా ఏర్పాటు చేసుకొని ప్రతి ఇంటిని సందర్శించి ఇంటింటా ఆరోగ్య వివరాలను తెలుసుకొని పాజిటివ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి స్వల్ప లక్షణాలు కలిగిన వారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్, తీవ్ర లక్షణాలు కలిగిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకునేలా గ్రామ, మండల స్తాయి. మున్సిపల్ అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, తహశీల్దారులు, మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారులు, ఎం.పి.ఓలు, ఎస్.హెచ్.ఓలు, మండల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కోవిడ్-19 వ్యాధి నివారణ చర్యలపై పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 మూడవ దశ అధికంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జన సమూహాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా సంబంధిత స్టేషన్ల పరిధిలో పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరు రెండు డోసులు కోడ్- 19 టీకాలు తీసుకొని ఉండేలా వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకునేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు పూర్తి రక్షణ కల్పించేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే ఆయుధమని, జిల్లాలో ప్రతిరోజు ఉదయం, సాయంకాలం ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వారం రోజుల్లో వ్యాక్సినేషను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మొదటి డోసు వేసుకొని రెండవ డోసు దాటిన వారి జాబితా ప్రకారం ప్రతి ఒక్కరికి రెండవ డోసు వ్యాక్సినేషన్ ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాలలో హ్యాబిటేషన్ వారీగా, నగర, మున్సిపల్ పరిధిలో వార్డులు, డివిజన్ల వారీగా ప్రతి వ్యక్తి రెండుడోసులు టీకా తీసుకొని ఉండే విధంగా లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి గాను అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయితీ కార్యదర్శులు, మండల, గ్రామస్థాయి అధికారులు విస్తృత స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ అందించాలని కలెక్టర్ తెలిపారు. ఇంతవరకు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇంకనూ వెనుకంజలో ఉన్న మండలాలలో మండల ప్రత్యేక అధికారులు వ్యాక్సినేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ ఆదేశించారు.

అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, అడిషనల్ డి.సి.పి. సుభాష్ చంద్రబోస్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వి. అప్పారావు, జిల్లా సర్వేలెన్స్ అధికారి డా॥రాజేష్, ఆర్.డి.ఓ. రవీంద్రనాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి మదన్ గోపాల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎం.పి.డి.ఓ.లు దితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

Share This Post