ఇంటింటి సర్వే కు పటిష్టమైన చర్యలు… జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య

జనగామ జనవరి 21.

కోవిద్ నియంత్రణలో భాగంగా జిల్లా వైద్యశాఖ, జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 300 ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. వైద్యశాఖ ద్వారా ఏఎన్ఎంలు హెల్త్ సూపర్వైజర్లు ఆశావర్కర్లు పంచాయతీ శాఖ ద్వారా పంచాయతీ సెక్రటరీల తో పాటుగా వీఆర్వో, టెక్నికల్ సి .ఈ లు ఉంటారని తెలియజేశారు

ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు జిల్లాలోని ప్రతి గ్రామాన్ని, ఆవాసాలను క్షేత్రస్థాయిలో సందర్శించి ఇంటింటి సర్వే చేపడతాయని సేకరించిన వివరాలు రిజిస్టర్లో నమోదు చేస్తున్నందున ప్రజలు సహకరించి, వారి ఆరోగ్య పరిస్థితులను సిబ్బందికి సమగ్రంగా వివరించాలన్నారు. తద్వారా ప్రజలకు సోకిన జలుబు జ్వరం దగ్గు వంటి లక్షణాలకు తగినట్లుగా మందులు అందజేయడం జరుగుతుందన్నారు.

అదేవిధంగా వ్యాక్సినేషన్ సమాచారం కూడా ఇవ్వాలని వ్యాక్సిన్ వేసుకునేవారు తప్పనిసరిగా రెండు డోసులు వేసుకోవాలన్నారు. కోవిద్ నిబంధనలు అయిన మాస్క్ ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించాలన్నారు.

జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలతో ఉన్నవారు ఐదు రోజులు క్రమం తప్పకుండా వైద్యులు అందించిన మందులు వేసుకోవాలని సూచిస్తూ ఆరోగ్యము కుదుట పడనివారు దగ్గర్లోని ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యం పొందా లన్నారు.

లక్షణాలపై తెలుసుకునేందుకు వైద్య సిబ్బందిని సంప్రదించాలని తెలియజేశారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం… జనగామ వారిచే జారీ చేయడమైనది

Share This Post