ఇంటింటి సర్వే తోనే కోవిడ్ కు చెక్ : జిల్లా కలెక్టర్ శశాంక

ఇంటింటి సర్వే తోనే కోవిడ్ కు చెక్ : జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్ధం

ఇంటింటి సర్వే తోనే కోవిడ్ కు చెక్…

మహబూబాబాద్, జనవరి. 20.

ఇంటింటి సర్వే ను పటిష్టంగా చేపట్టి పక్క ప్రణాళికతో కోవిడ్ కు చెక్ పెడతామని జిల్లా కలెక్టర్ శశాంక నివేదించారు.

గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ ను అరికట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ కోవిడ్ కొరకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ గ్రామాలలో వైద్య , పంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందితో బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే తోనే కోవిడ్ కు చెక్ పెడతామన్నారు. ప్రతి ఒక్కరినీ పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని వైద్యం అందిస్తామన్నారు. జిల్లాలోని 16 పి.హెచ్.సి.లు,2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు, 1యు.పి.హెచ్.సి. లలో హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్స్ లోను ఓ.పి.పెంచుతూ కరోన లక్షణాలున్న వారికి వైద్యం అందిస్తామన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో ఐసోలేషన్ బ్లాక్ ను ఏర్పాటు చేశామన్నారు.

అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యం పై నమ్మకం పెంచేందుకు కోవిడ్ నిర్దారణ కాగానే తక్షణం మందుల కిట్ అందజేయాలన్నారు. నియంత్రణ కు తీసుకోవలసిన చర్యలను వివరిస్తూ…ప్రతిరోజు ఒకసారి అయినా పాజిటివ్ సోకిన పేషంట్లను పలకరించి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వైద్యం అందిస్తూ ఆరోగ్యం కుడుటపడేంత వరకు సహకారం అందించాలన్నారు.
మందులకు కొదవలేదని 10 లక్షలు విలువజేసే మందులను జిల్లాలకు పంపించడం జరుగుతుందన్నారు.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ లో డోర్ టు డోర్ సర్వే తోనే రాష్ట్రానికి మంచి పేరు వచ్చిందని, నీతి ఆయోగ్ ప్రతినిధులు రాష్ట్రాన్ని కొనియాడారని, గతంలో మాదిరిగానే ఇంటింటి సర్వే చేపట్టి కోవిడ్ ను నియంత్రించాలన్నారు.

రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నియంత్రణ ను జనవరి నెలాఖరు లోగా అధికారులు సమన్వయంతో నియంత్రించాలని, గణతంత్ర వేడుకలను సాధారణంగా కొద్ది మందితో నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, నోడల్ అధికారి విక్రమ్ పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post