ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (IDOC) నిర్మాణ పనులను పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.

ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (IDOC) నిర్మాణ పనులలో వేగం పెంచి ఏప్రిల్ నెలాఖరుకు సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్, మొదటి స్లాబ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రక్కన ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.

ఈ సందర్బంగా ఐడిఓసి నిర్మాణా పనులను పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న ఏ ,బి ,సి, బ్లాక్ లలో పుట్టింగ్, డబుల్ పుట్టింగ్ నాణ్యత లోపించకుండా వేసి ఏప్రిల్ నెలాఖరుకు సి బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్, మొదటి స్లాబ్ పూర్తి చేయాలని అన్నారు. వేసవికాలంలోనే మిగతా ఏ, బి, బ్లాక్ ల గ్రౌండ్ ఫ్లోర్
పనులు పూర్తి చేయాలన్నారు. వర్షాకాలంలో నిర్మాణ పనులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. IDOC ఓ ప్రభుత్వ కార్యాలయంగా కాకుండా, అత్యాధునిక హాంగులతో కూడిన అద్బుతమైన కార్పోరేట్ ఆఫీస్ గా ఐడిఓసిని తీర్చిదిద్దాలని అన్నారు.

అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో జరుగుతున్న వాచ్ మేన్ రూమ్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వాచ్ మేన్ రూమును త్వరగా ఉపయోగంలోకి తీసుకురావాలని అన్నారు. గెస్ట్ హౌస్ లోకి ఇతరులకు అనుమతి లేకుండా చూడాలన్నారు. వర్షపు నీరు వృధా గా వెళ్లకుండా ప్రాంగణంలో ఇంకుడు గుంతను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ముందు ఖాళీ స్థలంలో మంచి మొక్కలు నాటుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఖాళీ స్థలంలో సేద తీర్చుకొనుటకు సిమెంటు బెంచ్ లను ఏర్పాటు చేయాలన్నారు. వాహనాలు పార్కింగ్ కొరకు స్థలాన్ని లేవని చేయవలసిందిగా సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు

కలెక్టర్ వెంట ములుగు తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, ఇంజనీర్ విష్ణు, ములుగు ఆర్ ఐ విజేందర్, సర్వేయర్ సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.

Share This Post