ఇంటిగ్రేటెడ్ వెజ్ & నాన్ – వెజ్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణము ను శంకుస్థాపన చేస్తున్న రాష్ట్ర పౌర సరఫరాలు & బి.సి సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

కరీంనగర్ ను సుందర నగరంగా తీర్చి తీర్చిదిద్దడమే లక్ష్యం

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

వ్యవసాయ మార్కెట్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రి

 

నగరములో నలుమూలల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు

నగరములో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి

ఇకపై రోడ్లమీద ఎలాంటి విక్రయాలు ఉండవు – మంత్రి
0000

కరీంనగర్ పట్టణమును సుందరంగా తీర్చి తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

సోమవారం కిసాన్ నగర్ వ్యవసాయ మార్కెట్ లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రూ. 5.80 కో ట్లతో ప్రారంభించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తో కలసి పూజలు నిర్వహించారు. అంతకుముందు 2 వ డివిజన్లో సాధారణ నిధులు 52 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్లు, పైప్ లైన్ పనులను, విద్యారణ్యపురి స్టార్ హాస్పిటల్ దగ్గర 1.30 కో ట్లాతో చేపట్టనున్న పైప్ లైన్ పనులను, 76 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను, అపోలో హాస్పిటల్ దగ్గర 1.30 కోట్లతో చేపట్టనున్న పైప్ లైన్, 76 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులను, తెలంగాణ భవన్ సమీపంలో డి ఎం ఎఫ్ టి నిధులు రూ. 2 కోట్లతో చేపట్టనున్న గోపాల్ పూర్ బీటీ రోడ్డు పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు నగరంలో నలుమూలల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు నిర్మించుటకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. కిసాన్ నగర్ లోని వ్యవసాయ మార్కెట్ లో కూరగాయలు, చేపలు, మాంసం, పూలు, పండ్లు అన్నీ ఒకే చోట విక్రయించేలా 5 కోట్ల 80 లక్షల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను ప్రారంభించి తొమ్మిది నెలలలోపు మార్కెట్ ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కింద మరియు మొదటి అంతస్తులో ఏర్పాటు చేసే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో 76 కు పైగా కూరగాయల దుకాణాలు, 40 కి పైగా పూలు, పండ్ల దుకాణాలు, మిగతావి చికెన్, మాంసము, చేపల దుకాణాలు ఉంటాయని తెలిపారు. రైతులు వ్యాపారులు రోడ్లపై, నేల మీద కూర్చొని విక్రయాలు చేయకుండా ఉండేందుకు హైజెనిక్ మార్కెట్ ను ఆధునికంగా నిర్మిస్తామని అన్నారు. అలాగే కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట రూ. 14 కోట్లాతో, 300 దుకాణాలు, రామ్ నగర్ మర్క్ఫెడ్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. శనివారం అంగడి లోని రైతు బజార్, కాశ్మీర్ గడ్డ రైతు బజార్లను ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు గా అభివృద్ధి చేస్తామని, ప్రజలందరికీ అన్ని ఒకే చోట దొరికే విధంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. కోతి రాంపూర్ లో ని పెరుమాండ్ల దేవాలయంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయుటకు సన్నాహాలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.

పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ స్థలాన్ని మంగళవారం ఉదయం పరిశీలిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమానికి రాష్ట్ర ఐఎఎస్ అధికారి రజత్ కుమార్, ఢిల్లీకి చెందిన ఐ ఎన్ ఎ కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొంటారని, పరిశీలన చేసిన అనంతరం పనుల ప్రారంభానికి టెండర్లను పిలుస్తామని మంత్రి తెలిపారు. జూన్ 2వ తేదీలోగా తీగల వంతెనను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు. వంతెనపై డైనమిక్ లైట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. కరీంనగర్ ను గొప్ప నగరంగా మార్చడమే లక్ష్యంగా తీర్చిదిద్దుతామని అన్నారు. రోడ్ల మీద ప్రజలు నడిచి వెళ్లేలా విక్రయదారులను ఇంటిగ్రేటెడ్ మార్కెట్లకు తరలిస్తామని మంత్రి తెలిపారు. అనంతరము కార్ఖానా గడ్డ లోని దూగోడ మిషన్ల సముదాయంలోని ఒక దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో కాలిపోయిన కలపను మంత్రి పరిశీలించారు. శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో టేకు కలప కాలిపోగా రూ. 50 లక్షలకుపైగా నష్టం వాటిల్లిందని ఆ దుకాణం యజమాని మంత్రికి, కలెక్టర్ కు వివరించారు

Share This Post