ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్ధం

ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను వెంటనే మొదలు పెట్టాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

మహబూబాబాద్, ఆగస్ట్-16:

సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు మొదలు కాకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే పనులు మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. పనులు మొదలుపెట్టి పురోగతి చూపించాలని లేనిపక్షంలో సంబంధిత కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

నిర్మాణానికి సంబంధించిన ప్లాన్ ను జిల్లా కలెక్టర్ పరిశిలించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మూడు బ్లాకుల నిర్మాణములో మొదటి బ్లాకు నాన్ వెజ్ కొరకు, రెండవ బ్లాకు వెజ్ కొరకు, మూడో బ్లాక్ పండ్ల, పుల వ్యాపారం కొరకు, మిగతా స్థలం పార్కింగ్ కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి జిల్లా కలెక్టర్కు వివరించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, మున్సిపల్ డి.ఈ. ఉపేందర్, కాంట్రాక్టర్ పోతురాజు పాల్గొన్నారు.

—————————————————————————–

జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయం చే జారీ చేయనైనది.

Share This Post