ఇండిజీనస్ నాలెడ్జ్ , హెల్త్ కేర్: వే ఫార్వర్డ్” అనే అంశంపై వర్చ్యువల్ మోడ్ లో జాతీయ వర్క్‌ షాప్‌

గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సాంకేతిక సహకారంతో “ఇండిజీనస్ నాలెడ్జ్ & హెల్త్ కేర్: వే ఫార్వర్డ్” అనే అంశంపై వర్చ్యువల్ మోడ్ లో రెండవ రోజు జాతీయ వర్క్‌ షాప్‌ ఈ రోజు హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమశాఖలో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల మధ్య జరిగినది.  శ్రీ నావల్ జిత్ కపూర్, జాయింట్ సెక్రటరీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూఢిల్లీ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొని, గిరిజన ఆరోగ్యంపై గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతరులు చేస్తున్న ప్రస్తుత ప్రయత్నాలను జాతీయ కార్యాచరణ ప్రణాళికగా మార్చి, సాంప్రదాయ గిరిజన వైద్యులను గుర్తించి, వారికి అవసరమైన శిక్షణనిచ్చి ఆయుష్ డిపార్ట్మెంట్ లో భాగంగా గాని, ఇతరత్రా గాని ప్రజలకు గిరిజన వైద్యం అందుబాటులోకి వచ్చేలా తదుపరి చర్యలు తీసుకోవాలని వర్క్‌ షాప్ లో పాల్గొన్నవారికి నిర్దేశం చేశారు. వర్క్‌ షాప్‌లో భాగంగా ఒడిషా గిరిజన పరిశోధన సంస్థ సంచాలకులు ప్రొఫెసర్ ఎ. బి. ఓట అధ్యక్షతన పలు పరిశోధకులు భారత గిరిజన వైద్య విధానాలు, వాటి ప్రాముఖ్యతలపై తమ పరిశోధనలను సమర్పించారు.  మరికొందరు పరిశోధకులు  తమ ప్రాంతాల క్షేత్రస్థాయి అనుభవాలను పంచుకున్నారు.

TCR & TI డైరెక్టర్ శ్రీ V. సర్వేశ్వర్ రెడ్డి, JD లు డాక్టర్ P. కళ్యాణ్ రెడ్డి, శ్రీమతి వేమూరి సముజ్వల, డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ మరియు UNDP ప్రతినిధి శ్రీమతి లీలావతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

Share This Post