ఇండియన్ ఏయిర్ ఫోర్స్ ఉద్యోగాల ఎంపిక పై అవగాహన సదస్సు

గురువారంన,  జిల్లా యువజన మరియు క్రీడల శాఖ వారి ఆద్వర్యంలో స్థానిక SLNS డిగ్రీ కళాశాల-భువనగిరి లో భారత వైమానిక దళం – 12 ఎయిర్ మెన్ సెలెక్షన్ సెంటర్ -బోయిన్ పల్లి సికిందరాబాద్  వారి సౌజన్యంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ  కార్యక్రమములో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి శ్రీ.కే. ధనంజనేయులు  గారు , భారత వైమానిక దళం -సిబ్బంది శ్రీ. కే రాజేష్ – సీనియర్ నాన్ కమీషన్డ్ ఆఫీసర్  గారు , నాన్ కమీషన్డ్ ఆఫీసర్ తారిక్ అన్వర్ గారు ,  SLNS డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా .  శ్రీ. శ్రీనివాస్ గారు , జిల్లా ఉపాధి కల్పనాధికారి – శ్రీమతి సాహితి గారు, IQAC-డా. జి. రమేష్ గారు ,  NCC ఆఫీసర్ జగన్నాథ్  గారు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా భారత వైమానిక దళం – సీనియర్ నాన్ కమీషన్డ్ ఆఫీసర్- శ్రీ. కే రాజేష్  గారు మాట్లాడుతూ భారత  వైమానిక దళం లో  చేరుటకు  10+2, విద్యార్హత  కలిగి , 17 -21 మద్య గల అవివాహిత పురుషులు మాత్రమే  అర్హులు అని తెలియజేశారు . అదేవిధంగా ఇందులో ముఖ్యంగా  రెండు   కేటగిరీలు ఉంటాయని అవి గ్రూప్ -X,- టెక్నికల్ విభాగం   మరియు  గ్రూప్ -Y- నాన్ టెక్నికల్ విభాగం,  అనే  కేటగిరీల గురించి  స్పస్టంగా వివరించారు. వీటికి ఎంపిక అగుటకు రెండు విధానాలు ఉంటాయని , అవి 1.STAR (Scheduled Test for Airman Recruitment), 2. రిక్రూట్మెంట్ ర్యాలీ ల  ద్వారా అని  తెలియజేశారు. రాత పరీక్ష మరియు దేహదారుడ్యా పరీక్ష, గ్రూప్ సంభాషణ మరియు మెడికల్ పరీక్షల ద్వారా ఎంపికచేయనున్నట్లు తెలిపినారు. ఉద్యోగాల కోసం ఎవరికి ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని,  డబ్బులు ఇచ్చి మోసపోవద్దు అని, ఈ ఎంపీకా విధానం పూర్తిగా పారదర్శకంగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంలో విద్యార్థులు అడిగిన అనేక సందేహాలను నివృత్తి చేశారు, మరిన్ని వివరాలకొరకు www.airmenselection.cdac.in మరియు my iaf app లో వివరాలను తెలుసుకోవచ్చని తెలియజేశారు. శ్రీ కే . ధనుంజనేయులు- జిల్లా యువజన క్రీడాల శాఖ అధికారి గారు మాట్లాడుతూ మన యాదాద్రి భువనగిరి జిల్లాలో వైమానిక దళం కు సంబంధించిన అవగాహనా సదస్సు ఇదే  మొట్టమొదటిదని,  జిల్లాలో అత్యధికంగా 15 సం. లనుండి 25 సం . లు  కలిగిన యువత మన దగ్గర  అధికంగా ఉన్నారని, వీరంతా సరైన అవగాహన లేకనే ఎక్కువగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని , ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రానున్న రోజుల్లో యువజన మరియు క్రీడల శాఖ వారి ఆధ్వర్యంలో మరెన్నో నిర్వహిస్తామని తెలియజేశారు. అంతే కాకుండా రక్షణ దళలల్లో పనిచేయడమంటే  కేవలం ఉద్యోగమే కాదు, ఇదొక జాతీయ సేవా అని కూడా గుర్తు చేశారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో రానున్న రోజుల్లో రిక్రూట్మెంట్ ర్యాలీలకు  సన్నాహాలు చేయనున్నట్లు తెలియజేశారు. SLNS డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా .  శ్రీ. శ్రీనివాస్ గారు మాట్లాడుతూ భువనగిరి లో ఈ కళాశాల ఏర్పాటు చేసినప్పటి నుండి రక్షణ రంగానికి సంబంధించిన  ఎలాంటి అవగాహన సదస్సు నిర్వహించనేలేదని , DYSO-ధనంజనేయులు గారి సహారకారంతో మా కళాశాలలో ఈ కార్యక్రమము ఏర్పాటు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. అవగాహన లేకనే యువతి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని వాపోయారు. కానీ ఇలాంటి అవగాహన సదస్సుల వల్ల విద్యార్థిని విద్యార్థులకు మంచి భవిష్యత్తును నిర్ణయించుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమములో SLNS డిగ్రీ కళాశాల NSS-అదికారులు, పాండురంగం గారు, సుధా గారు, కళాశాల సిబ్బంధి, యువజన సంఘాల నాయకులు కరుణ్  మరియు DYSO &  SDTC సిబ్బంది తో పాటు సుమారు 350 మంది విద్యార్థులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.   

Share This Post