ఇండియన్ మిషన్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్


విద్యార్థుల్లో ప్రయోగాల ద్వారా పరిశీలనాత్మక శక్తిని పెంపొందించి శాస్త్రీయ నైపుణ్యాలను వెలికితీయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీతసత్యనారాయణ
పెద్దపల్లి, నవంబర్ 3:-

విద్యార్థుల్లో శాస్త్రీయ అభిరుచిని పెంపొందించి సృజనాత్మక నైపుణ్యాలను వెలికితీయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయుల పైన ఉన్నదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ అన్నారు. ఇండియన్ మిషన్ ఉన్నత పాఠశాల పెద్దపల్లిలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విజ్ఞానశాస్త్ర,గణితశాస్త్ర ఉపాధ్యాయులకు సంచార ప్రయోగశాల నిమిత్తం ప్రయోగాల తయారీ, నమూనాల రూపకల్పనపై నిర్వహిస్తున్న నాలుగు రోజుల కార్యశాలను బుధవారం జిల్లా పాలనాధికారి సందర్శించి జిల్లా రిసోర్స్ పర్సన్స్ లకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, పరిశీలనాత్మక దృష్టిని పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. కొవిడ్-19 వల్ల గత సంవత్సరంన్నర కాలంగా పాఠశాలల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా విద్యార్థులు సైన్స్,మ్యాథ్స్ విషయపరిజ్ఞానంలో వెనుకబడ్డారని దానిని పూరించే విధంగా ఆర్.పిలు కృషిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి డి.మాధవి,ఉమ్మడి పరీక్షల బోర్డ్ కార్యదర్శి వి.హన్మంతు, మండల విద్యాధికారి టి.సురేంద్రకుమార్, జిల్లా సైన్స్ అధికారి బి.రవినందన్ రావు, సమగ్ర శిక్ష సమన్వయకర్త ఐ.విజయ్ కుమార్, విషయ నిపుణులు డాక్టర్.పి.ఎం షేక్ సి.హెచ్.మల్లేశ్ గౌడ్,పి.సురేందర్,జి అంజన్ కుమార్,ఎం.నరేష్, పి.హరిప్రసాద్,భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అంతకు ముందు భౌతిక,జీవ,గణిత శాస్త్ర ఉపాధ్యాయులు తయారుచేసిన నమూనాల ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించి పలు ఎగ్జిబిట్స్ పై పూర్తి సమాచారాన్ని ఉపాధ్యాయుల నుండి రాబట్టారు.

Share This Post