ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ,హైద్రాబాద్ జిల్లా శాఖ రెండో పర్యాయం ద్వితీయ వార్షికోత్సవ సంబరాలను జిల్లా శాఖ కార్యాలయంలో జరిపారు.చైర్మన్ మామిడి భీం రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ,హైద్రాబాద్ జిల్లా శాఖ రెండో పర్యాయం ద్వితీయ వార్షికోత్సవ సంబరాలను జిల్లా శాఖ కార్యాలయంలో జరిపారు.చైర్మన్ మామిడి భీం రెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పరిపాలన అధికారి కోటి రెడ్డి హాజరయ్యారు. ఆత్మీయ అతిధులుగా ప్రోఫెసర్ బాలకిషన్,తెలంగాణ గజట్టేడ్ ఆఫీసర్స్ ,హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు కృష్ణ యాదవ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కోవిడ్ సమయంలో హైద్రాబాడ్ జిల్లా శాఖ చేసినటువంటి సేవలు ఎవ్వరు చెయ్యలేదు అన్నారు. జిల్లా చైర్మన్ మామిడి భీం రెడ్డి నాయకత్వంలో ,మనేజ్మెంట్ సభ్యులు, అద్వైసోరీ కమిటీ, సబ్ కమిటీ మరియు వాలంటీర్ల సహాయ సహకరాలతో చాలా బాగా పనిచేస్తున్నారు ,భవిష్యత్తులో కూడా ఇలాగే పనిచేయాలి అని అన్నారు.చైర్మన్ మామిడి భీం రెడ్డి మాట్లాడుతూ బ్లడ్ బాంక్ ,డైలాసిస్,డైజ్ఞోస్టిక్కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అని అన్నారు.కృష్ణ యాదవ్ మాట్లాడుతూ తమ టీజీ ఓ మరియు ఎన్ జి ఓ సంఘాలను కూడా రెడ్ క్రాస్ కార్యక్రమాలలో భాగస్వామి చేస్తామని అన్నారు. ఎలక్షన్ కన్వీనర్ మధుబాబు చికిల్ మాట్లాడుతూ హైదేరాబాద్ రెడ్ క్రాస్ సేవలను జాతీయ సంయుక్త కార్యదర్శ నీల్ సింగ్ మెచ్చుకున్నారు అని అన్నారు .కార్యక్రమంలో వైస్ చైర్మన్ విజయ, ఏం. సి సభ్యులు అనురాధ, సుదర్శన్ రెడ్డి,,వినయ్ కిషోర్, సద్దాం, సందేశ్, రియాజ్ మరియు షేక్ మునీర్ పాషా,సతీష్ రెడ్డి ,రవి కిరణ్,శ్రవణ్,అభిషేక్ పాల్గొన్నారు.

Share This Post