ఇండోర్ స్టేడియం పనులు పూర్తిచేయండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఇండోర్ స్టేడియం పనులు పూర్తిచేయండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం–1                                                                                                                                                                                                                                        తేదిః 10-08-2021

ఇండోర్ స్టేడియం పనులు పూర్తిచేయండి ::  జిల్లా కలెక్టర్ జి. రవి

     జగిత్యాల, అగస్టు 10:  మెట్పల్లి ఇండోర్ స్టేడియం పనులకు ప్రాదాన్యతను ఇచ్చి త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.   మంగళవారం మెట్పల్లి పట్టణ కేంద్రంలో పర్యటించి చేపడుతున్న వివిధ పనుల పురోగతిని పరిశీలించారు.  ఈ సదర్బంగా స్టేడియం నిర్మాణ పనులను పరిశీలించి  స్టేడియం నిర్మాణం కొరకు సింగరేణి నుండి మంజూరైన 50లక్షలతో మొదటగా ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపట్టి అనంతరం వాకింగ్ ట్రాక్, గార్డెనింగ్ మొదలగు పనులను చేపట్టాలని అన్నారు.  అనంతరం ఓపేన్ జిమ్ ను పరిశీలించి కేటాయించిన 10 పరికరాలను ఏర్పాటు చేయండంతో పాటు వాటిని సంరక్షించాలని, టైల్స్ పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించి పూర్తిచేయాలని పేర్కోన్నారు.     గ్రౌండ్ లోపల వాహనాలకు ప్రవేశంలేకుండా  గేట్లను మూసివేయాలని  పేర్కోన్నారు.

మెట్పల్లి సిహెచ్సి ఆసుపత్రిలో చేపడుతున్న 12 పడకల ఐసియు వార్డు పునరుద్దరణ పనులను, ఇతర వార్డులను పరిశీలించి, పనులను సకాలంలో నాణ్యతలో లోపాలు లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు.  ఆసుపత్రికి అవసరమైన చిన్నచిన్న మరమ్మతులు, పెయింటింగ్, నేమ్ బోర్డ్స్ మొదలగునవి అందుబాటులో గల నిధులను వినియోగించుకోవాలని, ఇంకను అధనంగా నిధులు అవసరమైతే కలెక్టర్ నిధుల నుండి మంజూరు చేస్తామని తెలియజేశారు. అనంతరం ఎంపీడీవో మెట్పల్లి కార్యాలయంలో దళితవాడలో చేసినటువంటి సర్వే నివేధికలను పరిశీలించి తగు సూచనలు, ఆదేశాలు జారీచేశారు.

ఈ పర్యటనలో కోరుట్ల ఆర్డిఓ వినోద్, జిల్లా పంచాయితి అధికారి నరేష్, తహసీల్దార్ ఎన్. రాజేష్, ఎంపీడీవో భీమేష్, ఎంపీపీ మారు సాయిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ డి. సమయ్య, సి.హెచ్.సి సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్యసుద,  ఇతర డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

ఇండోర్ స్టేడియం పనులు పూర్తిచేయండి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post