ఇందన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని అదనపు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.

ఇందన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యతని అదనపు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.

జాతీయ ఇందన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరనీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (TSREDCO) ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో ఇంధన పొదుపు ప్రచార వాహనాన్ని రాజార్షి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఇంధన పొదుపు పై అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

రోజు రోజుకు జనాభా పెరుగడంతో పాటు ఇంధనాల వాడకం అధికమవుతుందన్నారు. అందుకు తగ్గట్టుగా ఇంధన వనరులు మాత్రం పెరగడం లేదన్నారు. ప్రతి ఒక్కరు ఇంధన పొదుపు పాటించాలన్నారు.

ప్రజలు విద్యుత్తు, వంట గ్యాస్ ,పెట్రోలు, డీజిల్ అవసరం మేరకే వాడాలని వృధా చేయరాదన్నారు. ఇంధనాలు విరివిగా వాడడం, వృధా చేయడంతో వాతావరణ కాలుష్యం పెరిగి మానవాళికి ముప్పుగా మారుతుందని ఆయన తెలిపారు.

ఇంధనం పొదుపుగా వాడి భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా చూడాలని కోరారు. సహజ ఇంధన వనరులు తరిగిపోతున్నవని, అందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ విద్యుత్ వాడినట్లయితే ఇందనం పొదుపు తో పాటు విద్యుత్ బిల్లుల ఆదా అవుతుందనీ,కాలుష్యాన్ని తగ్గించిన వారమవుతామని ఆయన అన్నారు.

తక్కువ విద్యుత్తు తో పనిచేసే ఫ్యాన్లు,ఎల్ ఈ డి బల్బులు, ట్యూబ్ లైట్ లు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇంధన వనరుల శాఖ జిల్లా మేనేజర్ మాణిక్యం చౌహాన్, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాస్ రావు, భూగర్భ జల శాఖ డిడీ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.

Share This Post