ఇంధన పొదుపుతో భావితరాలకు మేలు – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

ఇంధన పొదుపుతో భావితరాలకు మేలు – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

 

ఇంధన వనరులను భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వృథా వాడకాన్ని విడనాడాలని నాగర్కర్నూల్ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ  ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలల్లో భాగంగా గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో ఇంధన పొదుపు పై ప్రజల అవగాహన కోసం ఏర్పాటుచేసిన ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడి ట్యూబ్ లైట్లు స్టాల్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఎక్కువ మంది విద్యుత్‌ అవసరమున్నా, లేకున్నా అతిగా వినియోగిస్తుంటారని, దానివల్ల అధిక లోడ్‌ పడి విద్యుత్‌ కొరత ఏర్పడుతోందన్నారు.

జిల్లా అవసరాలకు కేటాయిస్తున్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలన్నారు.

ప్రత్యామ్నాయ వనరుల వినియోగంపై దృష్టిపెట్టాలన్నారు. ఉన్న నిల్వలను వృథా కాకుండా చూడాలన్నారు.

ఎల్ఈడీ బల్బుల వాడకం ద్వారా ఇంధనం ఆదా తోపాటు విద్యుత్ చార్జీల ఆదా అవుతాయని ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఇంధన పొదుపు శాఖ జిల్లా మేనేజర్ జే ఎస్ ఎన్ మూర్తి, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, న్యాయవాదులు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు

Share This Post