ఇక నుంచి ప్రతి సోమవారం మండల కేంద్రాలలో జనహిత కార్యక్రమం: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

*ఇక నుంచి ప్రతి సోమవారం*
*మండల కేంద్రాలలో ‘జనహిత’ కార్యక్రమం*

– *సోమవారం ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు జనహిత కార్యక్రమం*

– *తహసీల్దార్ ల పర్యవేక్షణలో జనహిత కార్యక్రమం*

– *మండల స్థాయి అధికారులు జనహిత కార్యక్రమంకు విధిగా హజరవ్వాలి*

– *పక్షం రోజుల్లో అర్జీలను పరిష్కరించి జనహిత పోర్టల్ లో అప్ లోడ్ చేయాలి*

– *జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

——————————
సిరిసిల్ల 15, మే 2022:
——————————
జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో గతంలో మాదిరి ఇక నుంచి ప్రతి సోమవారం తప్పనిసరిగా జన హిత కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.

ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు జనహిత కార్యక్రమం నిర్వహిస్తున్న మాదిరే మండల కేంద్రాలలో తహసీల్దార్ల పర్యవేక్షణలో ప్రతీ సోమవారం ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు నిర్వహించాలని తెలిపారు .

ఇందుకు గానూ మండల తహశీల్దార్ లు ఎంపీడీవోలతో కలిసి సరైన వేదికను గుర్తించాలన్నారు .

తహసీల్దార్ , ఎంపీడీవో , మండల వ్యవసాయశాఖ అధికారి , ఎంఈవో , ఏపీఎం , ఇరిగేషన్ ఏఈ , సెస్ ఏఈ , ఐసీడీఎస్ సూపర్వైజర్లు , మెడికల్ అధికారులు , అటవీ శాఖ అధికారులు , ఎక్సైజ్ శాఖ, ఇతర మండల అధికారులు పాల్గొనాలని సూచించారు . ప్రజావాణి హాజరైన, గైర్హాజరైన మండల స్థాయి అధికారులు వివరాలను అదే రోజు తనకు తహశీల్దార్ లు నివేదించాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

మండల జనహిత కార్యక్రమం కు ప్రతి సోమవారం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అదే రోజు జనహిత పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్నారు.

అలాగే జనహితలో వచ్చిన అర్జీలపై విచారణ జరిపి, తీసుకున్న చర్యల నివేదికను 15 రోజుల్లోగా పిటిషనర్‌కు తెలియజేయాలని, తీసుకున్న చర్యల నివేదికను జనహిత పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ విషయంలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించినా తీవ్రంగా పరిగణించి సంబంధిత వ్యక్తులపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post