ఇతర రాష్ట్రాల నుండి దాన్యం మన జిల్లాకు రాకుండా సరిహద్దు చెకో పోస్టుల్లో పటిష్ట నిఘా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎస్పీ సునీల్ దత్ తెలిపారు

. గురువారం భద్రాచలం మండలం, కూనవరం రోడ్లో ఏర్పాటు చేసిన సరిహద్దు చెకోపోస్టు, బూర్గంపాడు మార్కెట్ యార్డును, జింకలగూడెంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 24 గంటలు నిఘా కొనసాగాలని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోను ఇతర రాష్ట్రాల నుండి దాన్యం మన జిల్లాకు రాకుండా నియంత్రణ చేయాలని చెప్పారు. రెవిన్యూ, పోలీస్, రవాణా, మార్కెటింగ్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకు సరిహద్దు రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చెకోపోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు దళారీలను ఆశ్రయించి తక్కువ ధరకు దాస్యం విక్రయాలు చేయొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు నిర్వహించి మద్దతు ధరను పొందాలని చెప్పారు. రైతుల పేరుతో దళారీలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు, ట్రక్ షీట్ నమోదును పరిశీలించారు. ధాన్యం కొనుగోలు నుండి మిల్లుకు తరలించే వరకు జరుగుతున్న ప్రక్రియను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం చేయక కేటాయించిన మిల్లులకు రవాణా చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ సజావుగా జరగాలని, రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని చెప్పారు. దాన్యం విక్రయాలు నిర్వహణకు రైతులకు జారీ చేసిన టోకెన్లు ఆధారంగా కొనుగోలు కేంద్రాలకు రావాలని చెప్పారు. ప్రభుత్వం ప్రకటించిన నాణ్యతా ప్రమాణాలు పాటించు విధంగా రైతులకు క్లస్టర్ వారిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్రప్రకాశ్, డియం ప్రసాద్, భద్రాచలం, బూర్గంపాడు. తహసిల్దారులు శ్రీనివాస యాదవ్, భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Share This Post