ఇన్ పుట్ డీలర్లు కొత్త టెక్నాలజీతో నేర్చుకున్న పద్దతులను రైతులకు అందించాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం Diploma in Agriculture Extension Services for Input Dealers (DESHI) కోర్సును ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                       తేదీ:03-01-2022

ఇన్ పుట్ డీలర్లు కొత్త టెక్నాలజీతో నేర్చుకున్న పద్దతులను  రైతులకు అందించాలనే ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం Diploma in Agriculture Extension Services for Input Dealers (DESHI) కోర్సును ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి  తెలిపారు.

సోమవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(ఆత్మ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ నూతన సంవత్సరం లో ఎలాంటి విఘ్నాలు కలగకుండా వినాయకుడి పూజ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. రైతులకు అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు మరియు పురుగుల మందులు విక్రయించే క్రమం లో రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించాలని , రైతులు చాలా కష్టపడి పంటలు పండిస్తారని, వారి యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని అన్నారు. సరైన పంటకు సరైన మందులు, సాగు సలహాలు, సూచనల కొరకు తమ వద్దకు వచ్చే రైతులకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలని అన్నారు. ఈ కోర్సును మొదటగా 2003 లో ప్రారంభించారని తెలిపారు. జిల్లా లో 2018-19 మొదటి బ్యాచ్ , 2019-20 రెండవ బ్యాచ్ కంప్లీట్ అయ్యాయని, ప్రస్తుతం 2020-21 మూడవ బ్యాచ్ కోర్స్ పూర్తి చేసుకొని, నాలుగవ బ్యాచ్ ప్రారంభమవుతుందని తెలిపారు. కోర్స్ ద్వారా నేర్చుకున్న కొత్త పద్ధతులను, విధానాలను, నూతన టెక్నాలజీలను  రైతులకు తెలియజేయాలని, మీ దగ్గరికి వచ్చే రైతులతో మంచిగా వ్యవహరించాలని, రైతుల సమస్యలు తెలుసుకొని వారికి తగిన సలహాలు, సూచనలు చేయాలనీ అన్నారు. యాసంగి లో ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని, ఆరుతడి పంటలలో ఎలాంటి సమస్యలు లేకుండా విత్తనాలు, ఎరువుల పై దృష్టి సారించాలని అన్నారు. డీలర్లు గా కాకుండా విద్యార్థుల్లా ఉత్సాహం తో కోర్స్ నేర్చుకోవాలని, డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోని , జ్ఞానం పెంచుకోవాలని , కోర్స్ ను శ్రద్ధతో నేర్చుకొని  ప్రభుత్వ రూల్స్, గైడ్ లైన్స్ ప్రకారం కోర్స్ ను పూర్తీ చేయాలనీ, డీలర్లకు సూచించారు. రైతులకు సాగులో ఉన్న అన్ని శాస్త్రీయ పద్ధతుల గురించి వివరించి, రైతులు కుడా ఈ పద్ధతులను వాడి సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు  కోర్స్ గురించి పవర్ ప్రెసెంటేషన్ ద్వారాకలెక్టర్ గారికి  వివరించారు.

అనంతరం ఆధునిక భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే జయంతి సందర్బంగా జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమం లో ఇంచార్జ్ వ్యవసాయ అధికారి  సక్రియ నాయక్, డి.పి.ఆర్.ఓ చెన్నమ్మ, సురేష్ కుమార్ గౌడ్, ఇఫ్కో కంపెనీ మేనేజర్ బాలాజీ,  డీలర్లు, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే  జారి చేయనైనది.

Share This Post