ఇన్ పుట్ డీలర్లు కొత్త టెక్నాలజీతో నేర్చుకున్న పద్దతులను రైతులకు అందించాలని ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం Diploma in Agriculture Extension Services for Input Dealers (DESHI) కోర్సును ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ శృతి ఓజా తెలిపారు.

పత్రికా ప్రకటన                                                        తేదీ:25-08-2021

        ఇన్ పుట్ డీలర్లు కొత్త టెక్నాలజీతో నేర్చుకున్న పద్దతులను  రైతులకు అందించాలని ఉద్దేశ్యం తో రాష్ట్ర ప్రభుత్వం Diploma in Agriculture Extension Services for Input Dealers (DESHI) కోర్సును ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ శృతి ఓజా తెలిపారు.

        బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(ఆత్మ) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ మన జిల్లా లో సాగు విస్థిరణ 5,40,000 ఎకరాలు ఉందని  రైతులు 1,50,000 మంది రైతులు 514 మంది డీలర్లు ఉన్నారని, రైతులకు అవసరమైనటువంటి ఎరువులు విత్తనాలు మరియు పురుగుల మందులు విక్రయించే క్రమం లో నాణ్యమైనవి మరియు సరయిన పంటకు సరయిన మందులు, సాగు సలహాలు, సూచనల కొరకు తమ వద్దకు వచ్చే రైతులకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలని అన్నారు. ఈ కోర్సును మొదటగా 2003 లో ప్రారంభించారని తెలిపారు. జిల్లా లో 2018-19 మొదటి బ్యాచ్ , 2019-20 రెండవ బ్యాచ్ కంప్లీట్ అయ్యాయని, ప్రస్తుతం 2020-21 మూడవ బ్యాచ్ రన్ అవుతుందని తెలిపారు. ఈ కోర్సు కు అర్హత పదవ తరగతి పాసై , ఇన్ పుట్ డీలర్ అయి ఉండాలని తెలిపారు. ప్రతి బ్యాచ్ కి 40 మంది ఇన్ పుట్ డీలర్లకు ఎ పంటలకు సంబంధించిన ఎరువులు, పురుగుల మందులు, రసాయనాల గురించి , భుసార పరిక్షలు , రికార్డు నిర్వాహణ పై శిక్షణ నిచ్చారని  తెలిపారు. ఈ సంవత్సరం కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్ లను ప్రాధానం చేసి అభినందించారు. రైతులకు సాగులో ఉన్న అన్ని శాస్త్రీయ పద్ధతుల గురించి వివరించి, రైతులు కుడా ఈ పద్ధతులను వాడి సాగు చేసే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.ఈ కోర్స్ గురించి పవర్ ప్రెసెంటేషన్ ద్వారా జనార్ధన్ వివరించారు.

        ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, సురేష్ కుమార్, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————— జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి ద్వారా జారి చేయబడినది

Share This Post