జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు కొరకు ఇప్పటివరకు 1255 దరఖాస్తులు అందాయని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక excise కార్యాలయాన్ని తనిఖీ చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నూతన excise పాలసీని జిల్లాలో పతిష్టాoగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో నాలుగు నియోజక వర్గాలలో 99మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 1255 దరఖాస్తులు అందాయని అలాగే బుధవారం రోజున సూర్యాపేట నందు 144, తుంగతుర్తి 103, కోదాడ 226, హుజూర్ నగర్ 249 వచ్చాయని మొత్తం 722 దరఖాస్తులు అందాయని కలెక్టర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు డి. శ్రీనివాస్,excise సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


