ఇల్లందు ఆసుపత్రిలో న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు అందచేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో యాస్పి రేషనల్ అంశాలపై మహిళా శిశు సంక్షేమ, విద్య, వైద్య, డిఆర్డీఓ, ఎల్డిఎం, వ్యవసాయ, పౌర సరఫరాలు, పశు సంవర్ధక , పీఆర్, యాస్పి రేషనల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటుకు అత్యవసరంగా ప్రతిపాదనలు అందచేయాలని వైద్యాధికారులకు సూచించారు. ఇల్లందులో ఏర్పాటు చేయనున్న న్యూట్రిషన్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పనకు అంచనా ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పారు. అనిమియాతో బాధ పడుతున్న గర్భిణీ స్త్రీ లకు క్రమం తప్పక పరీక్షలు నిర్వహణకు అన్ని ఆసుపత్రులకు పరికరాలు అందచేయాలని చెప్పారు. ప్రతి నెల క్రమం తప్పక  గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రోగ్రామ్ అధికారికి సూచించారు.  సమాచారం తెలుసుకోవడానికి గూగుల్ డాక్స్ లో ప్రోఫార్మా పెట్టాలని, ప్రతి నెలా ప్రగతి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని    చెప్పారు. హై రిస్క్ ఉన్న గర్భిణీలు  వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదులు చేయాలని, తదుపరి అట్టి జాబితా ప్రకారం ఆరోగ్య కేంద్రం వారిగా పర్యవేక్షణ చేయాలని చెప్పారు. కెజిబివి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న  బాలికల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో అదనపు డయాలసిస్ కేంద్రాలు, యం ఆర్ ఐ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని గర్భిణీలకు వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక వార్డులు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని చెప్పారు.అంగన్వాడీ కేంద్రాల్లో చిరు ధాన్యాలతో కూడిన ఆహారాన్ని వారంలో రెండు రోజులకు అందచేయుటకు 100 కేంద్రాలు ఎంపిక చేయాలని చెప్పారు. చిరుధాన్యాలు కోతలు  జరుగుతున్నాయని, ప్రాసెస్ ఏ విదంగా చేస్తున్నారో వివరాలు ఇవ్వాలని చెప్పారు. తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న చిన్నారుల జాభితాననుసరించి  అంగన్వాడీ కేంద్రం వారిగా  సమగ్ర సర్వే చేయాలని  తెలిపారు.  ఉజ్వల యోజన క్రింద గ్యాస్ లేని నిరుపేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు జాబితా ఇవ్వాలని డిసిఓ కు సూచించారు. గ్యాస్ మంజూరుకు ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహణకు చర్యలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలో మొత్తం 1,51,000 వేల కుటుంబాలున్నాయని, వీరిలో 65 వేల కుటుంబాలు గ్యాస్ వినియోగిస్తున్నట్లు చెప్పారు.సాయిల్ హెల్త్ కార్డులు క్లస్టర్ కి ముగ్గురు చొప్పున చేసినట్లు చెప్పారు. జిల్లాలో 2400 సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేసినట్లు చెప్పారు.  కార్డులు జారీ తదుపరి వ్యవసాయంలో ఉత్పత్తి ఎలా ఉంది, పెట్టుబడిలో వచ్చిన వ్యత్యాసం తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఉద్యాన పంటల ఆన్లైన్ ద్వారా వ్యాపారం నిర్వహణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. జన్ దన్ యోజన బ్యాంక్ ఖాతాలు ప్రారం భించుటకు చేపట్టిన చర్యలపై కార్యాచరణ తయారు చేయాలని చెప్పారు.బ్రాంచ్ వారిగా లక్షాన్ని కేటాయించాలని ఎల్డిఎం కు సూచించారు.అటల్ పెన్షన్ యోజన పథకంపై  పంచాయతి, మున్సిపాల్టీలలో అవగాహన కల్పించాలని చెప్పారు.

ఈ సమావేశంలో వైద్య, విద్య, వ్యవసాయ, ఎల్డిఎం, పీఆర్, సంక్షేమ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post