ఇవిఎం గోదాము తనిఖీ చేసిన – కలెక్టర్ పి ఉదయ్ కుమార్.

నాగర్ కర్నూల్ పట్టణ శివారులోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద నున్న ఈవిఎం గోదామును కలెక్టర్‌ పి ఉదయ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. గోదాముకు వేసిన సీల్‌ను పరిశీలించారు.
ప్రతి మూడు నెలలకు ఒక సారి తాళం తీసి లోపల ఉన్న ఈవిఎం లను తనిఖీ చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా ఈవీఎం గోదాం బయట తాళాలు ఇతర భద్రతాపరమైన అంశాలను తనిఖీ చేశారు.
ఇక్కడ పూర్తిస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు.
బందోబస్తు సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఈవీఎం గోదాంకు ఎదురుగా నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న సఖి కేంద్ర భవనం లోకి తొందర్లోనే నాగర్ కర్నూల్ పట్టణంలో అద్దె భవనంలో కొనసాగుతున్న సఖి కేంద్రాన్ని వెంటనే మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించారు.
తనిఖీలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share This Post