*ఇసుక ప్రాంతాన్ని గుర్తించాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*

*ఇసుక ప్రాంతాన్ని గుర్తించాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*

*ప్రచురణార్థం-1*

*ఇసుక ప్రాంతాన్ని గుర్తించాలి :: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా*
జయశంకర్ భూపాలపల్లి, మే 6: మహాదేవ్ పూర్ మండలంలోని చంద్రుపల్లి, నాగపల్లి గ్రామాల్లో గోదావరి నదీ ఇసుక ప్రాంతాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గనులు భూగర్భ శాఖ, రెవిన్యూ, ఇర్రిగేషన్ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి, రెండు గ్రామాల్లో 7 లక్షల 92 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక అంచనా వేశారన్నారు. అన్నారం బ్యారేజి డౌన్ స్ట్రీమ్ లో ఇసుక, పూడిక తీత పనులు చేయాలని, దీంతో గేట్ల నిర్వహణ సులభమయి, నీటి ప్రవాహం చక్కగా జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లాలో చెక్ డ్యాం లలో పూడికతీత పనులు చేపట్టాలని ఆయన తెలిపారు. ఇట్టి చెక్ డ్యామ్ లు మల్హర్ రావు మండలం తాడిచెర్ల, మల్లారం, వళ్లంకుంట్ల, చిట్యాల మండలం వెంచరిని, టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి లలో ఉన్నాయని ఆయన అన్నారు. పూడికతీత పనులు శాఖలు సమన్వయంతో చేపట్టాలని, సాంకేతికపరంగా చేపట్టాలని ఆయన తెలిపారు. భద్రతా చర్యల్ని పాటిస్తూ, వర్షాకాలం వచ్చే లోపే ఇసుక తొలగింపు పూర్తి చేయాలన్నారు. పనులకు కాలపరిమితి విధించుకొని పూర్తి చేయాలన్నారు. పనులు చేపట్టడంలో నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. స్వర్ణలత, ఎడి మైన్స్ రవీందర్, డిపివో లత, ఎడి భూగర్భ జల శాఖ శ్రీనివాసరావు, జిల్లా ఇర్రిగేషన్ అధికారి మోహన్ రావు, ఇర్రిగేషన్ ఇఇ లు తిరుపతి రావు, యాదగిరి, డిఇ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి కార్యాలయంచే జారిచేయనైనది.

Share This Post