ఇసుక రవాణపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఇసుక రవాణపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం—2 తేదిః 29-07-2021
ఇసుక రవాణపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, జూలై, 29: జిల్లాలో ఇసుక రవాణపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసుల పై జిల్లాలోని ఆర్డిఓలు, తహసీల్దార్ల తో జూమ్ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మండలం వారిగా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఇసుక రవాణపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని, ఇసుక అక్రమరవాణా చేసే వారిపై కఠినంగా వ్యవహరించి చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనుమతి లేకుండా ఇసుకను రవాణ చేసి డంప్ చేసే స్థలాలను గుర్తించి డంప్ చేసిన భూయజమానులపై కేసులు పెట్టాలని, అన్ని మండలాల్లో ఇసుక అక్రమరవాణ చేసే వాహనాలకు పెనాల్టిలు మాత్రమే విధించకుండా వాహనాలను కూడా సీజ్ చేసి మీ అందుబాటులో పెట్టుకోవాలని, జిల్లాలో ఇప్పటి వరకు ఉపయోగించిన, అనుమతి మేరకు రవాణ చేసిన మరియు ఎంత ఇసుక పరిమాణం అందుబాటులో ఉంది, ఇండస్ట్రీ అధికారులచే సమీక్షించుకొని నివేధికను పంపించాలని ఆదేశించారు. కళ్యాణలక్ష్మి, షాదిముబారక్ కొరకు వచ్చే ప్రతి ధరఖాస్తు పై చర్యలను వేగవంతం చేయాలని, ప్రతి ధరఖాస్తును సరిగా పరిశీలించి దృవీకరించుకొని సరిగా ఉన్నవాటిని ఎమ్మెల్యేల అనుమతులు తీసుకోని బడ్జేట్ ప్రకారం లబ్దిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధరణి స్లాట్ బుక్కింగ్ సక్రమంగా జరిగినప్పటికి, మీసేవా కేంద్రాలలో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తునట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, తహసీల్దార్లు పరిశీలించి చర్యలు తీసుకోవాలని లేని యెడల సదరు తసీల్దార్ లపై తగు చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. కోర్టు కేసులు ఉన్న భూములపై కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే చర్యలు తీసుకోవాలని అన్నారు. సిలింగ్ ల్యాండ్ ప్రభుత్వ, అసైన్ మెంట్, పిఓబిలో ఉన్నవాటిపై ఎంక్వయిరి చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. పనులు సకాలంలో పూర్తిచేయాలని, తద్వారా ప్రతి ఫైలుపై సిబ్బందికి అవగాహన పెరుగుతుందని తెలిపారు. ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని సూచించారు. రైస్ మిల్లుల పై తనిఖీలు చేసి అక్రమ రవాణను నివారించగలగాలని, గ్రామాలలో ఎఫ్ పి షాపుల వారిగా కొనుగోలు చేసే వారి వివరాలు, ఎవరి ద్వారా బయటి ప్రాంతాలకు, మిల్లులకు రవాణా చేయడం జరుగుతుందో గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలోని ప్రతి షాపు వారిగా నిఘా ఉంచాలని, బియ్యం అక్రమరవాణ చేసే వారిని గుర్తించి వారిని బైండోవర్ చేసి చట్టరిత్యా పెనాల్టీలను విధించాలని సూచించారు. ద్వీచక్ర వాహనాలపై వచ్చి బియ్యం తీసుకువెల్లే వారిని గుర్తించాలని ఎంతమంది ఉంటే అంతమందిని బైండోవర్ చేయాలని అన్నారు. ఆహరభధ్రత కార్డులు పంపిణి పూర్తిచేయాలని, ఖాళీలు గల ఎఫ్ పి షాపుల భర్తి ప్రక్రియను కూడా వెంటనే పూర్తిచేయాలని అన్నారు.
ఈ సమావేశంలో జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు శ్రీమతి మాదురి, వినోద్ కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు , కలెక్టరేట్ పర్యవేక్షకులు తదితరులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

ఇసుక రవాణపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఇసుక రవాణపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఇసుక రవాణపై తహసీల్దార్లు కఠినంగా వ్యవహరించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post