ఇసుక రీచ్ లను ఏర్పాటు చేయాలి…

ప్రచురణార్ధం

ఇసుక రీచ్ లను ఏర్పాటు చేయాలి…

మహబూబాబాద్, నవంబర్,15.

ఇసుక రీచ్ లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఇసుక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి, మేచిరాజు పల్లి, నర్సింహులపేట మండలం జయపురం, చినగూడూరు మండలంలోని జయ్యారం, తొర్రుర్ మండలం లోని ఎస్.వి.కె.తండా,జమస్థాన్ పురం లలో మైనింగ్ అధికారులు, తహసీల్దార్ లతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రీచ్ ల ఏర్పాటు కొరకు నివేదిక ఇవ్వాలన్నారు. సివిల్ వర్క్స్ మొదలయ్యే తరుణం ఆసన్నమైనదని ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.

సేకరించిన ఇసుకను రిజిస్టర్ లలో నమోదు చేయాలని, సేకరించిన ఇసుకను ప్రభుత్వ పధకాలైన రెండు పడక గదుల ఇండ్లు, మోడల్ మర్కెట్స్ వంటి పనులకు ఇచ్చి రిజిస్టర్ లలో నమోదు చేసి ఇవ్వాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కొమరయ్య మైనింగ్ అధికారులు ఎడి రవీందర్, సురేష్, తహసీల్దార్ లు యోగేశ్వరరావు నాగభవాని రఫీ ఇమ్మానియేల్ కోమలి మున్సిపల్ కమిషనర్ ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
———————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post