ఈజిఎస్ క్రింద చేపట్టిన హరితహారం మొక్కల గణన చేపట్టండి- అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.

ఆగష్టు 30, 2021ఆదిలాబాదు:-

జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన హరితహారం కార్యక్రమం మొక్కల గణన చేపట్టాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్ లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్ లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, 2019 , 2020 సంవత్సరాలలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా నాటిన మొక్కలను గణన చేయాలనీ, అందుకు టీమ్ లను ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. సెప్టెంబర్ ఒకటి నుండి 15 వరకు మొక్కల గణన పూర్తీ చేయాలనీ అన్నారు. గణనకు సంబంధించిన వివరాలు ఏరోజుకారోజు అప్ లోడ్ చేయాలని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ లు మాట్లాడుతూ, జిల్లాలో ప్రతి మండలానికి ఒక టీమ్ చొప్పున ఏర్పాటు చేసి మొక్కల గణన చేపడతామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 టీమ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జూమ్ కాన్ఫరెన్స్ లో తెలిపిన విధంగా అన్ని అంశాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ శైలజ, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post