ఈజీఎస్ లో అన్ని పారామీటర్స్ మేరకు లక్ష్యాన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 13:–

ఈజీఎస్ లో అన్ని పారామీటర్స్ మేరకు లక్ష్యాన్ని పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులకు సూచించారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఏపీ వోలు, ఇసీలు మరియు టెక్నికల్ అసిస్టెంట్లకు జల శక్తి అభియాన్ పై సమీక్ష మరియు శిక్షణ ( పునశ్చరణ) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈజీఎస్ లో జిల్లాను టాప్ పొజిషన్ కు తీసుకు వెళ్ళాలన్నారు. 15 రోజుల లోగా ప్రణాళికతో లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. తనిఖీలకు అధికారులు వచ్చినప్పుడు కాకుండా ముందుగానే అన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. జాబ్ కార్డ్స్ అప్దే షన్స్, 7 రిజిస్టర్ ల నిర్వహణ, వర్క్ సైడ్ బోడ్స్ ఏర్పాటు చేయడం, మేట్స్ కు శిక్షణలు, పనులను గుర్తించడం, ఇతర పారా మీటర్ల మేరకు అప్డేషన్ ఉండాలన్నారు.
ఆయా విషయాలపై పంచాయతీ సెక్రెటరీ కి పూర్తి అవగాహన ఉండాలన్నారు. ముందుగా పనులను గుర్తించి పెట్టుకోవాలని, లేబర్ ను మొబలైజ్ చేయాలని సూచించారు. లేబర్ బడ్జెట్ లక్ష్యం పూర్తి కావాలన్నారు.
సెగ్రి గేషన్ షేడ్స్ వినియోగంలోకి తేవాలని, తడి ,పొడి చెత్త సేకరణ క్రమం తప్పకుండా జరగాలని, అట్టి చెత్తను సెగ్రీ గేషన్ షెడ్ కు తరలించి ఎరువు తయారు చేయడం, ఎరువును హరితహారం మొక్కలకు వేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని తెలిపారు.
ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని గ్రామ పంచాయితీలలో సేగ్రి గేషన్ జరుగుతున్నట్లు ధృవీకరణ ఇవ్వాలని కోరారు.

Sigri గేషన్ షెడ్లలో, వైకుంఠ దా మాల చుట్టూ మల్టీ లేయర్ 3 వరుసల ప్లాంటేషన్ పూర్తి కావాలన్నారు.
పల్లె ప్రకృతి వనాల్లో మొక్కల రక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆయా
అధికారులందరూ బాధ్యతగా పనిచేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజర్షి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, ఏపీ డి లు, ఎంపీడీవోలు, ఏ పీ ఓ లు, ఈ సి లు, టి ఎ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post