ఈద్ ముబారక్ ::జిల్లా కలెక్టర్ గోపి
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు అందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం సందర్బంగా ముస్లిం సోదరులకు కలెక్టర్ గోపి శుభాకాంక్షలు తెలిపారు
ముస్లింలు ఎంతో పవిత్రంగా కొలిచే ఖురాన్ గ్రంథం స్వర్గం నుంచి భూమికి ఈ రంజాన్ మాసంలోనే వచ్చిందని నమ్ముతారని…అందుకే ఈ పండుగ ముస్లింలకు చాలా పవిత్రమైందని కలెక్టర్ పేర్కొన్నారు
ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పండుగ ను ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆనందం గా జరుపుకోవాలని కలెక్టర్ కోరారు
అల్లా అందరినీ చల్లగా చూడాలి, సుఖ శాంతులు
ప్రతీ ఇంట నిత్యం ఉండాలన్నారు
క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక పవిత్ర రంజాన్ మాసం లో వచ్చే ఈ పండుగ తో అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ అన్నారు