ఈనెల 15 వ తేదీన చారిత్రక గోల్కొండ కోటలోనిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

ఈనెల 15 వ తేదీన చారిత్రక గోల్కొండ కోటలోనిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని తెలిపారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్ సెల్యూట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీనికి ముందుగా ముఖ్యమంత్రి పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 1000 మంది కళాకారులు స్వాగతం పలకుతారని ఆయన తెలిపారు. స్వాతంత్ర దినోత్సవేడుకల నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నేడు సాయంత్రం పరిశీలించారు.

వజ్రోత్సవాలలో భాగంగా ఈ నెల 16 వ తేదీన ఉదయం 11.30 గంటలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో సమాజంలోని ప్రతి ఒక్కరు పాల్గొనాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో ప్రతి రహదారిలో ట్రాఫిక్ నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. ప్రతీ కార్యాలయం, ప్రముఖ చారిత్రక ప్రదేశాలు, అన్నింటిలో  సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు చేశామని వివరించారు.

ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ , ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , అడిషనల్ డీజీ జితేందర్, ఇంటలిజెన్స్ అడిషల్ డీజీ అనిల్ కుమార్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి , రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు , జిహెచ్ఎంసి కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, TSRTC MD సజ్జనార్,  సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ , TSTDC MD మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post