ఈనెల 16 నుండి 2022 జనవరి 14 వరకు శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ధనుర్మాసం వ్రత మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తెలిపారు

బుధవారం రామాలయం లో ధనుర్మాస ఉత్సవాల నిర్వహణపై అధికారులు,ఆలయ కమిటీ తో నిర్వహించిన సమీక్ష సమావేశం లో ఆయన మాట్లాడారు. ధనుర్మాస ఉత్సవాల విజయవంతం  కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ధనుర్మాసం వ్రత మహోత్సవాలు ఆహ్వాన కరపత్రాన్నీ  నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగిరి లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవోపేతంగా ధనుర్మాసం వ్రత మహోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే ఈ సంవత్సరం సైతం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ఆలయ కమిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ధనుర్మాస ఉత్సవాల నిర్వహణపై చర్చించినట్లు తెలిపారు. ఈనెల 16 నుండి వచ్చే నెల 14 వరకు నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలు విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, డిఎస్పి వెంకటేశ్వర్ రెడ్డి , ఆలయ చైర్మన్ చకిలం వేణుగోపాలరావు, స్థానిక కౌన్సిలర్ యమా కవిత దయాకర్, ఆలయ ఈవో న రాజేశ్వర శర్మ, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఆలయ ధర్మకర్తలు యాట జయప్రద, మిరియాల స్వామి, మామిళ్ల హనుమంతు, కక్కిరేణి లక్ష్మీనారాయణ, పాదం ప్రియాంక, వేదాంతం శ్రీనివాస ఆచార్యులు, యాదగిరి ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post