ఈనెల 17న జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి అన్ని రకాలుగా సిద్దం చేయాలి:  కలెక్టర్ హరీశ్.

పత్రిక ప్రకటన

తేదీ : 10–08–2022

జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి అన్ని రకాలుగా సిద్దం చేయాలి,
అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి,
ఈనెల 17న కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉంచేలా చూడాలి,
మేడ్చల్ – మల్కాజిగిరి నూతన కలెక్టరేట్‌ను పరిశీలించిన కలెక్టర్ హరీశ్,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 17న ప్రారంభించనున్నందున జిల్లా కలెక్టర్ హరీశ్ బుధవారం షామీర్పేటలోని సమీకృత కలెక్టరేట్‌ను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ మొత్తం కలియదిరిగి పనులు ఇంకా ఏమైనా చేయాల్సి ఉందా అనే వివరాలను తెలుసుకొన్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి స్వయంగా ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలో జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని అలాగే సమన్వయంతో వారికి అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. నూతన కలెక్టరేట్లో ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే రెండుమూడు రోజుల్లో పూర్తి చేసి వినియోగంలోకి వచ్చేలా చూడాల్సిందిగా సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించాలని దీంతో పాటు భవనం ఆవరణలో, చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్ డీఎఫ్‌వో అశోక్‌కుమార్‌ను ఆదేశించారు . జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనంలో పచ్చదనం వెల్లివిరిసేలా అందమైన పూలమొక్కలను ఏర్పాటు చేయాలని. కలెక్టరేట్‌తో పాటు ఆవరణలో ఏమాత్రం చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయడంతో పాటు శానిటైజేషన్ష చేయించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే మార్గం మొత్తం శుభ్రంగా ఉంచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రమణమూర్తిని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం రోజున విద్యుత్తు సరఫరాలో ఎలాంటి అంతరాయం, ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని విద్యుత్తు శాఖ అధికారులకు కలెక్టర్ హరీశ్ సూచించారు. దీంతో పాటు నూతన కలెక్టరేట్లో ఏర్పాటు చేయనున్న వేదికను అందంగా అలంకరించాలని వేదిక వద్ద మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం రోజు వరకు ప్రతినిత్యం తాను అన్ని శాఖల అధికారులతో కలిసి ఉంటానని ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. జిల్లాలో నిర్మించిన కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు నుంచే కార్యాచరణ రూపొందించుకొని సంబంధిత శాఖల సిబ్బందికి అప్పగించిన పనులను బాధ్యతతో చేయాల్సిందిగా కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట , జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, , జడ్పీ సీఈవో దేవసహాయం ,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) బాలానగర్ డీసీపీ సందీప్, అధికారిణి పద్మజారాణి, ఆర్ అండ్ బీ, శ్రీనివాసులు మూర్తి, పంచయతీరాజ్శాఖ అధికారులు, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, డీపీవో రమణమూర్తి ,సంబంధిత శాఖల జిల్లా అధికారులు. సిబ్బంది తదితరులు ఉన్నారు.

Share This Post