ఈనెల 17న జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు రక్తదాన శిబిరాలకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియోజకవర్గాల గుర్తింపు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్

పత్రిక ప్రకటన

తేదీ : 16–08–2022

ఈనెల 17న జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు
రక్తదాన శిబిరాలకు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియోజకవర్గాల గుర్తింపు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఐదు కేంద్రాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్ సీహెచ్సీలో, ఉప్పల్ నియోజకవర్గంలోని పీహెచ్సీలో, మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఏరియా హాస్పటల్లో, కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని షాపూర్నగర్ యూపీహెచ్సీలో, కూకట్పల్లి నియోజకవర్గంలోని రామ్దేవ్ హాస్పటల్లో రక్తాన శిబిరాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో జిల్లా వ్యాప్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువకులు, వైద్యులు, వైద్యసిబ్బంది రక్తదానం చేయాలని కలెక్టర్ హరీశ్ కోరారు. ఈ మేరకు రక్తదాన శిబిరాలు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, మేడ్చల్ – మల్కాజిగిరి డీసీహెచ్ఎస్ డాక్టర్ కొట్యానాయక్, జిల్లా యువజనుల శాఖ అధికారి బల్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు.

Share This Post