ఈనెల 17న నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు: రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,

పత్రిక ప్రకటన–1

తేదీ : 10–08–2022

ఈనెల 17న మేడ్చల్–మల్కాజిగిరి నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం,
నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు,
కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి,
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా నూతన కలెక్టరేట్‌ను ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారని అందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఈనెల 17న మధ్యాహ్నం 3 గంటలకు షామీర్పేటలోని అంతాయిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన నూతన సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. కొత్త కలెక్టరేట్ భవనాన్ని అన్ని హంగులతో నిర్మించినందున విద్యుత్తు కాంతులతో అలంకరణ, అన్ని వసతులు ముందుగానే ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని సమావేశమంలో మంత్రి తెలిపారు. జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనానంలో ఇంకా ఏమైనా పనులు మిగిలినట్లయితే వెంటనే పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను మంత్రి మల్లారెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి స్వయంగా ముఖ్యమంత్రి వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులకు ఆయా పనులకు సంబంధించి బాధ్యత తీసుకుంటే కార్యక్రమం విజయవంతమవుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలెక్టరేట్ ప్రారంభోత్సవాన్ని విజవంతం చేయాలని సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు శ్యాంసన్, లింగ్యానాయక్, , జడ్పీ సీఈవో దేవసహాయం ,జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) అధికారిణి పద్మజారాణి, ఆర్ అండ్ బీ, పంచయతీరాజ్శాఖ అధికారులు, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, డీపీవో రమణమూర్తి ,మున్సిపల్ ఛైర్పర్సన్లు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post